Jeremiah · chapter 51 · verse 61
Jeremiah 51:61 in Telugu
కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను.
Kaagaa yirmeeyaa sheraayaato itlanenu neevu babulonunaku vachchinappudu ee maatalannitini chadivi vinipinchavalenu.
Jeremiah 51:61 in English
- King James Version (KJV)
- And Jeremiah said to Seraiah, When thou comest to Babylon, and shalt see, and shalt read all these words;
- World English Bible (WEB)
- Jeremiah said to Seraiah, “When you come to Babylon, then see that you read all these words,
- American Standard Version (ASV)
- And Jeremiah said to Seraiah, When thou comest to Babylon, then see that thou read all these words,
- Bible in Basic English (BBE)
- And Jeremiah said to Seraiah, When you come to Babylon, see that you give them all these words;
- Darby Translation (DBY)
- And Jeremiah said to Seraiah, When thou comest to Babylon, see that thou read all these words;
- Webster's Bible (WBS)
- And Jeremiah said to Seraiah, When thou shalt come to Babylon, and shalt see, and shalt read all these words;
- Young's Literal Translation (YLT)
- And Jeremiah saith unto Seraiah, 'When thou dost enter Babylon, then thou hast seen, and hast read all these words,
Read in context
- 59సిద్కియా యేలుబడియందు నాలుగవ సంవత్సరమున శెరాయా దండు భోజనసామగ్రికి అధికారియైయుండి సిద్కియాతోకూడ బబులోనునకు వెళ్లినప్పుడు నేరీయా కుమారుడును మహసేయా మనుమడునైన ఆ శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట.
- 60యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములొ వ్రాసెను.
- 61కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను.
- 62ఈలాగున నీవు ప్రకటింపవలెను యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి.
- 63ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి
Cross references
- Mark 13:1 మార్కు 13:1ఆయన దేవాలయములోనుండి వెళ్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడుబోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను.
- Matthew 24:1 మత్తయి 24:1యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.
- Revelation 1:3 ప్రకటన 1:3సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
- 1 Thessalonians 5:27 1 థెస్సలొనీకయులకు 5:27సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.
- Jeremiah 29:1–2 యిర్మీయా 29:1–2రాజైన యెకోన్యా తల్లియగు రాణియు, రాజ పరివారమును, యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను,
- Colossians 4:16 కొలొస్సయులకు 4:16ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.
- 1 Thessalonians 4:18 1 థెస్సలొనీకయులకు 4:18కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.