Job · chapter 14 · verse 19
Job 14:19 in Telugu
జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.
Jalamu raallanu aragadeeyunudaani pravaahamulu bhoomiyokka dhoolini kottukonipovunu neevaite narula aashanu bhangaparachuchunnaavu.
Job 14:19 in English
- King James Version (KJV)
- The waters wear the stones: thou washest away the things which grow [out] of the dust of the earth; and thou destroyest the hope of man.
- World English Bible (WEB)
- The waters wear the stones. The torrents of it wash away the dust of the earth. So you destroy the hope of man.
- American Standard Version (ASV)
- The waters wear the stones; The overflowings thereof wash away the dust of the earth: So thou destroyest the hope of man.
- Bible in Basic English (BBE)
- The stones are crushed small by the force of the waters; the dust of the earth is washed away by their overflowing: and so you put an end to the hope of man.
- Darby Translation (DBY)
- The waters wear the stones, the floods thereof wash away the dust of the earth; and thou destroyest the hope of man.
- Webster's Bible (WBS)
- The waters wear the stones: thou washest away the things which grow [out] of the dust of the earth; and thou destroyest the hope of man.
- Young's Literal Translation (YLT)
- Stones have waters worn away, Their outpourings wash away the dust of earth, And the hope of man Thou hast destroyed.
Read in context
- 17నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
- 18పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును.
- 19జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.
- 20నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురునీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు.
- 21వారి కుమారులు ఒకవేళ షునత వహించినను అదివారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపకయుందురు.
Cross references
- Job 7:6 యోబు 7:6నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.
- Job 27:8 యోబు 27:8దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది?
- Job 19:10 యోబు 19:10నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.
- Luke 12:19–20 లూకా 12:19–20నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
- Genesis 7:21–23 ఆదికాండము 7:21–23అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను. నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
- Psalm 30:6–7 కీర్తనలు 30:6–7నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని
- Genesis 6:17 ఆదికాండము 6:17ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ కుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును;
- Ezekiel 37:11 యెహెజ్కేలు 37:11అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు