Job · chapter 7 · verse 6
Job 7:6 in Telugu
నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.
Naa dinamulu netagaani naadekantenu vadigaa gatinchuchunnavi nireekshana leka avi kshayamai povuchunnavi.
Job 7:6 in English
- King James Version (KJV)
- My days are swifter than a weaver’s shuttle, and are spent without hope.
- World English Bible (WEB)
- My days are swifter than a weaver’s shuttle, and are spent without hope.
- American Standard Version (ASV)
- My days are swifter than a weaver’s shuttle, And are spent without hope.
- Bible in Basic English (BBE)
- My days go quicker than the cloth-worker's thread, and come to an end without hope.
- Darby Translation (DBY)
- My days are swifter than a weaver's shuttle, and are spent without hope.
- Webster's Bible (WBS)
- My days are swifter than a weaver's shuttle, and are spent without hope.
- Young's Literal Translation (YLT)
- My days swifter than a weaving machine, And they are consumed without hope.
Read in context
- 4ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును. తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడుదును.
- 5నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది.
- 6నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.
- 7నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.
- 8నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.
Cross references
- Job 9:25 యోబు 9:25పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్న విక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.
- Job 17:15 యోబు 17:15నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
- Job 17:11 యోబు 17:11నా దినములు గతించెను నా యోచన నిరర్థకమాయెను నా హృదయ వాంఛ భంగమాయెను.
- Isaiah 38:12–13 యెషయా 38:12–13నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు. ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు
- Isaiah 40:6–7 యెషయా 40:6–7ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.
- Psalm 103:15–16 కీర్తనలు 103:15–16నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.
- Job 16:22 యోబు 16:22కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్లుదును.
- 1 Peter 1:24 1 పేతురు 1:24గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
- Proverbs 14:32 సామెతలు 14:32అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
- Psalm 144:4 కీర్తనలు 144:4నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి.
- Job 6:11 యోబు 6:11నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
- James 1:11 యాకోబు 1:11సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.