Job · chapter 15 · verse 13
Job 15:13 in Telugu
దేవుని మీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?
Devuni meeda neevela aagrahapaduchunnaavu? Nee notanundi atti maatalela raanichchuchunnaavu?
Job 15:13 in English
- King James Version (KJV)
- That thou turnest thy spirit against God, and lettest [such] words go out of thy mouth?
- World English Bible (WEB)
- that you turn your spirit against God, and let such words go out of your mouth?
- American Standard Version (ASV)
- That against God thou turnest thy spirit, And lettest words go out of thy mouth?
- Bible in Basic English (BBE)
- So that you are turning your spirit against God, and letting such words go out of your mouth?
- Darby Translation (DBY)
- That thou turnest thy spirit against God, and lettest words go out of thy mouth?
- Webster's Bible (WBS)
- That thou turnest thy spirit against God, and lettest [such] words go out of thy mouth?
- Young's Literal Translation (YLT)
- For thou turnest against God thy spirit? And hast brought out words from thy mouth:
Read in context
- 11దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా?
- 12నీ హృదయము ఏల క్రుంగిపోయెను?నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?
- 13దేవుని మీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?
- 14శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?
- 15ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.
Cross references
- Job 15:25–27 యోబు 15:25–27వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కల పైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.
- James 3:2–6 యాకోబు 3:2–6అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా ఓడలనుకూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును. ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.
- James 1:26 యాకోబు 1:26ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.
- Job 10:3 యోబు 10:3దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?
- Job 12:6 యోబు 12:6దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
- Psalm 34:13 కీర్తనలు 34:13చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము.
- Malachi 3:13 మలాకీ 3:13యెహోవా సెలవిచ్చునదేమనగానన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు.
- Job 9:4 యోబు 9:4ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
- Romans 8:7–8 రోమీయులకు 8:7–8ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.