Psalms · chapter 34 · verse 13
Psalm 34:13 in Telugu
చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము.
Chedda maatalu palukakunda nee naalukanu kapatamaina maatalu palukakunda nee pedavulanu kaachu konumu.
Psalm 34:13 in English
- King James Version (KJV)
- Keep thy tongue from evil, and thy lips from speaking guile.
- World English Bible (WEB)
- Keep your tongue from evil, and your lips from speaking lies.
- American Standard Version (ASV)
- Keep thy tongue from evil, And thy lips from speaking guile.
- Bible in Basic English (BBE)
- Keep your tongue from evil, and your lips from words of deceit.
- Darby Translation (DBY)
- Keep thy tongue from evil, and thy lips from speaking guile;
- Webster's Bible (WBS)
- Keep thy tongue from evil, and thy lips from speaking guile.
- Young's Literal Translation (YLT)
- Keep thy tongue from evil, And thy lips from speaking deceit.
Read in context
- 11పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.
- 12బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?
- 13చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము.
- 14కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.
- 15యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.
Cross references
- James 3:5–10 యాకోబు 3:5–10ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు.
- Psalm 141:3 కీర్తనలు 141:3యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
- Proverbs 21:23 సామెతలు 21:23నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
- 1 Peter 2:22 1 పేతురు 2:22ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
- James 1:26 యాకోబు 1:26ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- Colossians 3:9 కొలొస్సయులకు 3:9ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ
- Proverbs 13:3 సామెతలు 13:3తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.
- James 3:2 యాకోబు 3:2అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును
- Psalm 39:1 కీర్తనలు 39:1నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.
- Matthew 12:35–37 మత్తయి 12:35–37సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు.
- Proverbs 12:22 సామెతలు 12:22అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.