Job · chapter 23 · verse 4
Job 23:4 in Telugu
ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.
Aayana sannidhini nenu naa vyaajyemunu vishadaparachedanu vaadamulato naa noru nimpukonedanu.
Job 23:4 in English
- King James Version (KJV)
- I would order [my] cause before him, and fill my mouth with arguments.
- World English Bible (WEB)
- I would set my cause in order before him, and fill my mouth with arguments.
- American Standard Version (ASV)
- I would set my cause in order before him, And fill my mouth with arguments.
- Bible in Basic English (BBE)
- I would put my cause in order before him, and my mouth would be full of arguments.
- Darby Translation (DBY)
- I would order the cause before him, and fill my mouth with arguments;
- Webster's Bible (WBS)
- I would order [my] cause before him, and fill my mouth with arguments.
- Young's Literal Translation (YLT)
- I arrange before Him the cause, And my mouth fill [with] arguments.
Read in context
- 2నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది
- 3ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.
- 4ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.
- 5ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అదినేను తెలిసికొందునుఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.
- 6ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును
Cross references
- Job 13:18 యోబు 13:18ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.
- Daniel 9:18–19 దానియేలు 9:18–19నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.
- Numbers 14:13–19 సంఖ్యాకాండము 14:13–19మోషే యెహోవాతో ఇట్లనెనుఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడ వనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమా రులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించి యున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా
- Isaiah 43:26 యెషయా 43:26నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.
- Joshua 7:8–9 యెహోషువ 7:8–9ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీ యులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను? కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసిన యెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా
- Psalm 43:1 కీర్తనలు 43:1దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
- Genesis 32:12 ఆదికాండము 32:12నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.
- Exodus 32:12–13 నిర్గమకాండము 32:12–13ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.
- Job 37:19 యోబు 37:19మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది
- Genesis 18:25–32 ఆదికాండము 18:25–32ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని యెడల నేనింకొక మారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను.
- Psalm 25:11 కీర్తనలు 25:11యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.