Job · chapter 31 · verse 1
Job 31:1 in Telugu
నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?
Nenu naa kannulato nibandhana chesikontini kanyakanu nenelaagu choochudunu?
Job 31:1 in English
- King James Version (KJV)
- I made a covenant with mine eyes; why then should I think upon a maid?
- World English Bible (WEB)
- “I made a covenant with my eyes; how then should I look lustfully at a young woman?
- American Standard Version (ASV)
- I made a covenant with mine eyes; How then should I look upon a virgin?
- Bible in Basic English (BBE)
- I made an agreement with my eyes; how then might my eyes be looking on a virgin?
- Darby Translation (DBY)
- I made a covenant with mine eyes; and how should I fix my regard upon a maid?
- Webster's Bible (WBS)
- I Made a covenant with my eyes; why then should I think upon a maid?
- Young's Literal Translation (YLT)
- A covenant I made for mine eyes, And what — do I attend to a virgin?
Read in context
- 1నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?
- 2ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును? ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?
- 3దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.
Cross references
- James 1:14–15 యాకోబు 1:14–15ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
- Matthew 5:28–29 మత్తయి 5:28–29నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
- Psalm 119:37 కీర్తనలు 119:37వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
- 1 John 2:16 1 యోహాను 2:16లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
- Proverbs 6:25 సామెతలు 6:25దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.
- 2 Samuel 11:2–4 2 సమూయేలు 11:2–4ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చిఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.
- Proverbs 4:25 సామెతలు 4:25నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
- Genesis 6:2 ఆదికాండము 6:2దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.
- Proverbs 23:31–33 సామెతలు 23:31–33ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు