Job · chapter 34 · verse 28
Job 34:28 in Telugu
బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
Beedala morranu aayanayoddaku vachchunatlu chesiri deenula morranu aayanaku vinabadunatlu chesiri.
Job 34:28 in English
- King James Version (KJV)
- So that they cause the cry of the poor to come unto him, and he heareth the cry of the afflicted.
- World English Bible (WEB)
- so that they caused the cry of the poor to come to him. He heard the cry of the afflicted.
- American Standard Version (ASV)
- So that they caused the cry of the poor to come unto him, And he heard the cry of the afflicted.
- Bible in Basic English (BBE)
- So that the cry of the poor might come up to him, and the prayer of those in need come to his ears.
- Darby Translation (DBY)
- So that they cause the cry of the poor to come unto him, and he heareth the cry of the afflicted.
- Webster's Bible (WBS)
- So that they cause the cry of the poor to come to him, and he heareth the cry of the afflicted.
- Young's Literal Translation (YLT)
- To cause to come in unto Him The cry of the poor, And the cry of the afflicted He heareth.
Read in context
- 26దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.
- 27ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.
- 28బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
- 29ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింప గలవాడెవడు?ఆయన తన ముఖమును దాచుకొనినయెడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను ఒకటే
- 30భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
Cross references
- James 5:4 యాకోబు 5:4ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
- Exodus 3:7 నిర్గమకాండము 3:7మరియు యెహోవా యిట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.
- Job 35:9 యోబు 35:9అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.
- Exodus 3:9 నిర్గమకాండము 3:9ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని.
- Psalm 12:5 కీర్తనలు 12:5బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియుదరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Exodus 22:23–27 నిర్గమకాండము 22:23–27వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కు లేనివారగుదురు. నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్ప గించుము. వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహ మునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.
- Job 29:12–13 యోబు 29:12–13ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి పించితిని. నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
- Exodus 2:23–24 నిర్గమకాండము 2:23–24ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.
- Isaiah 5:7 యెషయా 5:7ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.
- Job 24:12 యోబు 24:12జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.
- Job 31:19–20 యోబు 31:19–20వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱెలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
- Job 22:9–10 యోబు 22:9–10విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది.