Job · chapter 35 · verse 9
Job 35:9 in Telugu
అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.
Anekulu balaatkaaramu cheyutavalana janulu kekalu veyuduru balavantula bhujabalamunaku bhayapadi sahaayamukorakai kekalu veyuduru.
Job 35:9 in English
- King James Version (KJV)
- By reason of the multitude of oppressions they make [the oppressed] to cry: they cry out by reason of the arm of the mighty.
- World English Bible (WEB)
- “By reason of the multitude of oppressions they cry out. They cry for help by reason of the arm of the mighty.
- American Standard Version (ASV)
- By reason of the multitude of oppressions they cry out; They cry for help by reason of the arm of the mighty.
- Bible in Basic English (BBE)
- Because the hand of the cruel is hard on them, men are making sounds of grief; they are crying out for help because of the arm of the strong.
- Darby Translation (DBY)
- By reason of the multitude of oppressions they cry; they cry out by reason of the arm of the mighty:
- Webster's Bible (WBS)
- By reason of the multitude of oppressions they make [the oppressed] to cry: they cry out by reason of the arm of the mighty.
- Young's Literal Translation (YLT)
- Because of the multitude of oppressions They cause to cry out, They cry because of the arm of the mighty.
Read in context
- 7నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా? ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?
- 8నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును.
- 9అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.
- 10అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు
- 11భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును లేరు.
Cross references
- Exodus 2:23 నిర్గమకాండము 2:23ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.
- Job 34:28 యోబు 34:28బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
- Job 12:19 యోబు 12:19యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.
- Nehemiah 5:1–5 నెహెమ్యా 5:1–5తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసి కొందుమనిరి. మరికొందరుక్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి. మరికొందరురాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితివిు. మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తె లలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
- Psalm 56:1–2 కీర్తనలు 56:1–2దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగ వలెనని యున్నారు
- Psalm 43:2 కీర్తనలు 43:2నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?
- Exodus 3:9 నిర్గమకాండము 3:9ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని.
- Psalm 55:2–3 కీర్తనలు 55:2–3నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టుల బలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను. వారు నామీద దోషము మోపుచున్నారుఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.
- Job 24:12 యోబు 24:12జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.
- Psalm 12:5 కీర్తనలు 12:5బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియుదరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Luke 18:3–7 లూకా 18:3–7ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు - నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను. మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధి పతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?
- Job 40:9 యోబు 40:9దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా?