Job · chapter 35 · verse 15
Job 35:15 in Telugu
ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను
Aayana kopamuto dandimpaka poyinandunanu nishchayamugaa durahankaaramunu aayana gurtimpaka poyinandunanu
Job 35:15 in English
- King James Version (KJV)
- But now, because [it is] not [so], he hath visited in his anger; yet he knoweth [it] not in great extremity:
- World English Bible (WEB)
- But now, because he has not visited in his anger, neither does he greatly regard arrogance,
- American Standard Version (ASV)
- But now, because he hath not visited in his anger, Neither doth he greatly regard arrogance;
- Bible in Basic English (BBE)
- And now ... ;
- Darby Translation (DBY)
- But now, because he hath not visited in his anger, doth not [Job] know [his] great arrogancy?
- Webster's Bible (WBS)
- But now, because [it is] not [so] , he hath visited in his anger; yet he knoweth [it] not in great extremity:
- Young's Literal Translation (YLT)
- And, now, because there is not, He hath appointed His anger, And He hath not known in great extremity.
Read in context
- 13నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.
- 14ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను.
- 15ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను
- 16నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
Cross references
- Psalm 89:32 కీర్తనలు 89:32నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.
- Job 4:5 యోబు 4:5అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- Hosea 11:8–9 హోషేయ 11:8–9ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది. నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
- Job 13:15 యోబు 13:15ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.
- Luke 1:20 లూకా 1:20మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.
- Job 30:15–31 యోబు 30:15–31భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను. నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను. నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును. ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా? బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను. సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని. నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
- Job 9:14 యోబు 9:14కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
- Psalm 88:11–16 కీర్తనలు 88:11–16సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు కొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల? బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి.
- Numbers 20:12 సంఖ్యాకాండము 20:12అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.
- Hebrews 12:11–12 హెబ్రీయులకు 12:11–12మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.