Job · chapter 36 · verse 24
Job 36:24 in Telugu
మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.
Manushyulu keertinchina aayana kaaryamunu mahimaparachutakai neevu jaagrattapadumu.
Job 36:24 in English
- King James Version (KJV)
- Remember that thou magnify his work, which men behold.
- World English Bible (WEB)
- “Remember that you magnify his work, about which men have sung.
- American Standard Version (ASV)
- Remember that thou magnify his work, Whereof men have sung.
- Bible in Basic English (BBE)
- See that you give praise to his work, about which men make songs.
- Darby Translation (DBY)
- Remember that thou magnify his work, which men celebrate.
- Webster's Bible (WBS)
- Remember that thou magnify his work, which men behold.
- Young's Literal Translation (YLT)
- Remember that thou magnify His work That men have beheld.
Read in context
- 22ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు?
- 23ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?
- 24మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.
- 25మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు.
- 26ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.
Cross references
- Revelation 15:3 ప్రకటన 15:3వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
- Psalm 145:10–12 కీర్తనలు 145:10–12యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
- Psalm 72:18 కీర్తనలు 72:18దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
- Luke 1:46 లూకా 1:46అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
- Psalm 111:2–4 కీర్తనలు 111:2–4యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగల వారందరు వాటిని విచారించు దురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు
- Psalm 107:15 కీర్తనలు 107:15ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
- Psalm 111:8 కీర్తనలు 111:8అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.
- Job 12:13–25 యోబు 12:13–25జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు. ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచునుత్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.
- Psalm 59:16 కీర్తనలు 59:16నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీకృపనుగూర్చి ఉత్సాహగానము చేసెదను
- Psalm 34:3 కీర్తనలు 34:3నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.
- Psalm 28:5 కీర్తనలు 28:5యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును.
- Psalm 86:8–10 కీర్తనలు 86:8–10ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు