Job · chapter 36 · verse 22
Job 36:22 in Telugu
ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు?
Aalochinchumu, devudu shaktimantudai ghanata vahinchinavaadu aayananu polina bodhakudevadu?
Job 36:22 in English
- King James Version (KJV)
- Behold, God exalteth by his power: who teacheth like him?
- World English Bible (WEB)
- Behold, God is exalted in his power. Who is a teacher like him?
- American Standard Version (ASV)
- Behold, God doeth loftily in his power: Who is a teacher like unto him?
- Bible in Basic English (BBE)
- Truly God is lifted up in strength; who is a ruler like him?
- Darby Translation (DBY)
- Lo, God is exalted in his power: who teacheth as he?
- Webster's Bible (WBS)
- Behold, God exalteth by his power: who teacheth like him?
- Young's Literal Translation (YLT)
- Lo, God doth sit on high by His power, Who [is] like Him — a teacher?
Read in context
- 20జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.
- 21జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు కొనియున్నావు.
- 22ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు?
- 23ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?
- 24మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.
Cross references
- 1 Samuel 2:7–8 1 సమూయేలు 2:7–8యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.
- Romans 13:1 రోమీయులకు 13:1ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.
- Luke 1:52 లూకా 1:52సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను
- Jeremiah 27:5–8 యిర్మీయా 27:5–8అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు. ఏ జనము ఏ రాజ్యము బబులోనురాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనముచేయించు వరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
- Isaiah 48:17 యెషయా 48:17నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
- Daniel 5:18 దానియేలు 5:18రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.
- Isaiah 14:5 యెషయా 14:5దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.
- Psalm 75:7 కీర్తనలు 75:7దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
- Jeremiah 31:38 యిర్మీయా 31:38యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.
- Isaiah 54:13 యెషయా 54:13నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
- Psalm 94:10 కీర్తనలు 94:10అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?
- Psalm 94:12 కీర్తనలు 94:12యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.