Job · chapter 4 · verse 9
Job 4:9 in Telugu
దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.
Devudu oodagaa vaaru nashinchuduruaayana kopaagni shvaasamuvalana vaaru leka povuduru.
Job 4:9 in English
- King James Version (KJV)
- By the blast of God they perish, and by the breath of his nostrils are they consumed.
- World English Bible (WEB)
- By the breath of God they perish. By the blast of his anger are they consumed.
- American Standard Version (ASV)
- By the breath of God they perish, And by the blast of his anger are they consumed.
- Bible in Basic English (BBE)
- By the breath of God destruction takes them, and by the wind of his wrath they are cut off.
- Darby Translation (DBY)
- By the breath of God they perish, and by the blast of his nostrils are they consumed.
- Webster's Bible (WBS)
- By the blast of God they perish, and by the breath of his nostrils are they consumed.
- Young's Literal Translation (YLT)
- From the breath of God they perish, And from the spirit of His anger consumed.
Read in context
- 7జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?
- 8నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.
- 9దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.
- 10సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును.
- 11ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.
Cross references
- Job 15:30 యోబు 15:30వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.
- Isaiah 11:4 యెషయా 11:4కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
- Isaiah 30:33 యెషయా 30:33పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.
- 2 Thessalonians 2:8 2 థెస్సలొనీకయులకు 2:8అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
- Psalm 18:15 కీర్తనలు 18:15యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగానీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.
- Revelation 2:16 ప్రకటన 2:16కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.
- Job 1:19 యోబు 1:19గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది ¸యౌవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
- Exodus 15:10 నిర్గమకాండము 15:10నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.
- Exodus 15:8 నిర్గమకాండము 15:8నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను
- Job 40:13 యోబు 40:13కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము.
- 2 Kings 19:7 2 రాజులు 19:7అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.