Job · chapter 4 · verse 8
Job 4:8 in Telugu
నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.
Nenu choochinantavaraku akramamunu dunnikeedunu vittuvaaru daanine koyuduru.
Job 4:8 in English
- King James Version (KJV)
- Even as I have seen, they that plow iniquity, and sow wickedness, reap the same.
- World English Bible (WEB)
- According to what I have seen, those who plow iniquity and sow trouble, reap the same.
- American Standard Version (ASV)
- According as I have seen, they that plow iniquity, And sow trouble, reap the same.
- Bible in Basic English (BBE)
- What I have seen is that those by whom trouble has been ploughed, and evil planted, get the same for themselves.
- Darby Translation (DBY)
- Even as I have seen, they that plough iniquity and sow mischief, reap the same.
- Webster's Bible (WBS)
- Even as I have seen, they that plow iniquity, and sow wickedness, reap the same.
- Young's Literal Translation (YLT)
- As I have seen — ploughers of iniquity, And sowers of misery, reap it!
Read in context
- 6నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?
- 7జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?
- 8నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.
- 9దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.
- 10సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును.
Cross references
- Galatians 6:7–8 గలతీయులకు 6:7–8మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.
- Proverbs 22:8 సామెతలు 22:8దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
- Hosea 8:7 హోషేయ 8:7వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.
- 2 Corinthians 9:6 2 కొరింథీయులకు 9:6కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
- Jeremiah 4:18 యిర్మీయా 4:18నీ ప్రవర్తనయు నీ క్రియ లును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?
- Hosea 10:12–13 హోషేయ 10:12–13నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమ యము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి. నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధము నకు ఫలము పొందియున్నారు.
- Job 15:35 యోబు 15:35వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.
- Psalm 7:14–16 కీర్తనలు 7:14–16పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు. వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.