Job · chapter 5 · verse 7
Job 5:7 in Telugu
నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.
Nippu ravvalu paiki egurunatlu narulu shramaanubhavamunake puttuchunnaaru.
Job 5:7 in English
- King James Version (KJV)
- Yet man is born unto trouble, as the sparks fly upward.
- World English Bible (WEB)
- but man is born to trouble, as the sparks fly upward.
- American Standard Version (ASV)
- But man is born unto trouble, As the sparks fly upward.
- Bible in Basic English (BBE)
- But trouble is man's fate from birth, as the flames go up from the fire.
- Darby Translation (DBY)
- For man is born to trouble, as the sparks fly upwards.
- Webster's Bible (WBS)
- Yet man is born to trouble, as the sparks fly upward.
- Young's Literal Translation (YLT)
- For man to misery is born, And the sparks go high to fly.
Read in context
- 5ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి
- 6శ్రమ ధూళిలోనుండి పుట్టదు. బాధ భూమిలోనుండి మొలవదు.
- 7నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.
- 8అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
- 9ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
Cross references
- Job 14:1 యోబు 14:1స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.
- Genesis 3:17–19 ఆదికాండము 3:17–19ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
- Ecclesiastes 5:15–17 ప్రసంగి 5:15–17వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు; అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినము లన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.
- 1 Corinthians 10:13 1 కొరింథీయులకు 10:13సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.
- Psalm 90:8–9 కీర్తనలు 90:8–9మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.
- Ecclesiastes 2:22 ప్రసంగి 2:22సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటి చేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?
- Ecclesiastes 1:8 ప్రసంగి 1:8ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.