Ecclesiastes · chapter 2 · verse 22
Ecclesiastes 2:22 in Telugu
సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటి చేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?
Sooryuni krinda naruniki tatasthinchu prayaasa mantati chetanu, vaadu talapettu kaaryamu lannitichetanu, vaanikemi dorukuchunnadi?
Ecclesiastes 2:22 in English
- King James Version (KJV)
- For what hath man of all his labour, and of the vexation of his heart, wherein he hath laboured under the sun?
- World English Bible (WEB)
- For what does a man have of all his labor and of the striving of his heart, in which he labors under the sun?
- American Standard Version (ASV)
- For what hath a man of all his labor, and of the striving of his heart, wherein he laboreth under the sun?
- Bible in Basic English (BBE)
- What does a man get for all his work, and for the weight of care with which he has done his work under the sun?
- Darby Translation (DBY)
- For what will man have of all his labour and of the striving of his heart, wherewith he hath wearied himself under the sun?
- Webster's Bible (WBS)
- For what hath man of all his labor, and of the vexation of his heart, in which he hath labored under the sun?
- Young's Literal Translation (YLT)
- For what hath been to a man by all his labour, and by the thought of his heart that he laboured at under the sun?
Read in context
- 20కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని.
- 21ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది.
- 22సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటి చేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?
- 23వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే.
- 24అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకర మైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని.
Cross references
- Psalm 127:2 కీర్తనలు 127:2మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.
- Ecclesiastes 1:3 ప్రసంగి 1:3సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి?
- Philippians 4:6 ఫిలిప్పీయులకు 4:6దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
- Ecclesiastes 3:9 ప్రసంగి 3:9కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?
- 1 Peter 5:7 1 పేతురు 5:7ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
- Ecclesiastes 4:6 ప్రసంగి 4:6శ్రమయును గాలి కైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.
- 1 Timothy 6:8 1 తిమోతికి 6:8కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.
- Matthew 6:34 మత్తయి 6:34రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
- Ecclesiastes 5:17 ప్రసంగి 5:17ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినము లన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.
- Ecclesiastes 4:8 ప్రసంగి 4:8ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.
- Ecclesiastes 6:7–8 ప్రసంగి 6:7–8మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు. బుద్ధిహీనులకంటె జ్ఞానుల విశేషమేమి? సజీవులయెదుట బ్రదుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి?
- Ecclesiastes 8:15 ప్రసంగి 8:15అన్నపానములు పుచ్చుకొని సంతో షించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడ వలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.