Job · chapter 8 · verse 21
Job 8:21 in Telugu
నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురుదుష్టుల గుడారము ఇక నిలువకపోవును.
Ninnu pagapattuvaaru avamaanabharitulagudurudushtula gudaaramu ika niluvakapovunu.
Job 8:21 in English
- King James Version (KJV)
- Till he fill thy mouth with laughing, and thy lips with rejoicing.
- World English Bible (WEB)
- He will still fill your mouth with laughter, your lips with shouting.
- American Standard Version (ASV)
- He will yet fill thy mouth with laughter, And thy lips with shouting.
- Bible in Basic English (BBE)
- The time will come when your mouth will be full of laughing, and cries of joy will come from your lips.
- Darby Translation (DBY)
- Whilst he would fill thy mouth with laughing and thy lips with shouting,
- Webster's Bible (WBS)
- Till he shall fill thy mouth with laughing, and thy lips with rejoicing.
- Young's Literal Translation (YLT)
- While he filleth with laughter thy mouth, And thy lips with shouting,
Read in context
- 19ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.
- 20ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.
- 21నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురుదుష్టుల గుడారము ఇక నిలువకపోవును.
- 22అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును.
Cross references
- Psalm 126:2 కీర్తనలు 126:2మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.
- Genesis 21:6 ఆదికాండము 21:6అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.
- Psalm 126:6 కీర్తనలు 126:6పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.
- Psalm 32:11 కీర్తనలు 32:11నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లపించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.
- Luke 6:21 లూకా 6:21ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.
- Ezra 3:11–13 ఎజ్రా 3:11–13వీరు వంతు చొప్పున కూడియెహోవా దయాళుడు, ఇశ్రాయేలీ యుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులంద రును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయుల లోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.
- Isaiah 65:13–14 యెషయా 65:13–14కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.
- Psalm 100:1 కీర్తనలు 100:1సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
- Job 5:22 యోబు 5:22పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.
- Nehemiah 12:43 నెహెమ్యా 12:43మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలుకూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను.
- Psalm 98:4 కీర్తనలు 98:4సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.