Job · chapter 9 · verse 10
Job 9:10 in Telugu
ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.
Evadunu telisikonaleni mahattayina kaaryamulanu lekkalenanni adbhutakriyalanu aayana cheyuchunnaadu.
Job 9:10 in English
- King James Version (KJV)
- Which doeth great things past finding out; yea, and wonders without number.
- World English Bible (WEB)
- He does great things past finding out; yes, marvelous things without number.
- American Standard Version (ASV)
- That doeth great things past finding out, Yea, marvellous things without number.
- Bible in Basic English (BBE)
- Who does great things not to be searched out; yes, wonders without number.
- Darby Translation (DBY)
- Who doeth great things past finding out, and wonders without number.
- Webster's Bible (WBS)
- Who doeth great things past finding out; yes, and wonders without number.
- Young's Literal Translation (YLT)
- Doing great things till there is no searching, And wonderful, till there is no numbering.
Read in context
- 8ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.
- 9ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు.
- 10ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.
- 11ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.
- 12ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?
Cross references
- Job 5:9 యోబు 5:9ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
- Psalm 72:18 కీర్తనలు 72:18దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
- Ephesians 3:20 ఎఫెసీయులకు 3:20మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,
- Romans 11:33 రోమీయులకు 11:33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
- Daniel 4:2–3 దానియేలు 4:2–3మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.
- Psalm 136:4 కీర్తనలు 136:4ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును.
- Ecclesiastes 3:11 ప్రసంగి 3:11దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.
- Isaiah 40:26–28 యెషయా 40:26–28మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు. యాకోబూనా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
- Exodus 15:11 నిర్గమకాండము 15:11యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
- Psalm 71:15 కీర్తనలు 71:15నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.
- Job 37:23 యోబు 37:23సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగియుందురు.
- Job 26:12–14 యోబు 26:12–14తన బలమువలన ఆయన సముద్రమును రేపునుతన వివేకమువలన రాహాబును పగులగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?