Job · chapter 37 · verse 23
Job 37:23 in Telugu
సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగియుందురు.
Sarvashaktudagu devudu mahaatmyamugalavaadu. Aayana manaku agocharudu. Nyaayamunu neetini aayana emaatramunu cherupadu. Anduvalana narulu aayanayandu bhayabhaktulu kaligiyunduru.
Job 37:23 in English
- King James Version (KJV)
- [Touching] the Almighty, we cannot find him out: [he is] excellent in power, and in judgment, and in plenty of justice: he will not afflict.
- World English Bible (WEB)
- We can’t reach the Almighty. He is exalted in power. In justice and great righteousness, he will not oppress.
- American Standard Version (ASV)
- [Touching] the Almighty, we cannot find him out: He is excellent in power; And in justice and plenteous righteousness he will not afflict.
- Bible in Basic English (BBE)
- There is no searching out of the Ruler of all: his strength and his judging are great; he is full of righteousness, doing no wrong.
- Darby Translation (DBY)
- The Almighty, we cannot find him out: excellent in power, and in judgment, and in abundance of justice, he doth not afflict.
- Webster's Bible (WBS)
- [Touching] the Almighty, we cannot find him out: [he is] excellent in power, and in judgment, and in abundance of justice: he will not afflict.
- Young's Literal Translation (YLT)
- The Mighty! we have not found Him out, High in power and judgment, He doth not answer! And abundant in righteousness,
Read in context
- 21ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనుపరచును.
- 22ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు.
- 23సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగియుందురు.
- 24తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు.
Cross references
- 1 Timothy 6:16 1 తిమోతికి 6:16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
- Romans 11:33 రోమీయులకు 11:33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
- Job 36:5 యోబు 36:5ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.
- Lamentations 3:32–33 విలాపవాక్యములు 3:32–33ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.
- Psalm 99:4 కీర్తనలు 99:4యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.
- Job 9:4 యోబు 9:4ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
- Ezekiel 18:32 యెహెజ్కేలు 18:32మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Job 11:7 యోబు 11:7దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?
- Ezekiel 18:23 యెహెజ్కేలు 18:23దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Isaiah 45:21 యెషయా 45:21మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
- Isaiah 63:9 యెషయా 63:9వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.
- Proverbs 30:3–4 సామెతలు 30:3–4నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?