Joel · chapter 2 · verse 10
Joel 2:10 in Telugu
వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
Vaati bhayamucheta bhoomi kampinchuchunnadi aakaashamu tattarinchuchunnadi sooryachandrulaku tejoheenata kaluguchunnadi nakshatramulaku kaanti tappuchunnadi.
Joel 2:10 in English
- King James Version (KJV)
- The earth shall quake before them; the heavens shall tremble: the sun and the moon shall be dark, and the stars shall withdraw their shining:
- World English Bible (WEB)
- The earth quakes before them. The heavens tremble. The sun and the moon are darkened, and the stars withdraw their shining.
- American Standard Version (ASV)
- The earth quaketh before them; the heavens tremble; the sun and the moon are darkened, and the stars withdraw their shining.
- Bible in Basic English (BBE)
- The earth is troubled before them and the heavens are shaking: the sun and the moon have become dark, and the stars keep back their shining:
- Darby Translation (DBY)
- The earth quaketh before them; the heavens tremble; the sun and the moon are darkened, and the stars withdraw their shining.
- Webster's Bible (WBS)
- The earth shall quake before them; the heavens shall tremble: the sun and the moon shall be dark, and the stars shall withdraw their shining:
- Young's Literal Translation (YLT)
- At their face trembled hath the earth, Shaken have the heavens, Sun and moon have been black, And stars have gathered up their shining.
Read in context
- 8ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.
- 9పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.
- 10వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
- 11యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
- 12ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు
Cross references
- Matthew 24:29 మత్తయి 24:29ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును.
- Isaiah 13:10 యెషయా 13:10ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
- Joel 3:15–16 యోవేలు 3:15–16సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్ర ముల కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
- Psalm 18:7 కీర్తనలు 18:7అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను.
- Acts 2:20 అపొస్తలుల కార్యములు 2:20ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.
- Ezekiel 32:7–8 యెహెజ్కేలు 32:7–8నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసెదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Mark 13:24–25 మార్కు 13:24–25ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
- Jeremiah 4:23 యిర్మీయా 4:23నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
- Revelation 6:12 ప్రకటన 6:12ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
- Revelation 8:12 ప్రకటన 8:12నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
- Nahum 1:5 నహూము 1:5ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.
- Isaiah 34:4 యెషయా 34:4ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.