John · chapter 10 · verse 20
John 10:20 in Telugu
వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.
Vaarilo anekuluvaadu dayyamu pattina vaadu, verrivaadu; vaani maata enduku vinuchunnaaraniri.
John 10:20 in English
- King James Version (KJV)
- And many of them said, He hath a devil, and is mad; why hear ye him?
- World English Bible (WEB)
- Many of them said, “He has a demon and is insane! Why do you listen to him?”
- American Standard Version (ASV)
- And many of them said, He hath a demon, and is mad; why hear ye him?
- Bible in Basic English (BBE)
- And a number of them said, He has an evil spirit and is out of his mind; why do you give ear to him?
- Darby Translation (DBY)
- but many of them said, He has a demon and raves; why do ye hear him?
- Webster's Bible (WBS)
- And many of them said, He hath a demon, and is insane; why hear ye him?
- Young's Literal Translation (YLT)
- and many of them said, 'He hath a demon, and is mad, why do ye hear him?'
Read in context
- 18ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
- 19ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.
- 20వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.
- 21మరి కొందరుఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.
- 22ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగు చుండెను.
Cross references
- John 7:20 యోహాను 7:20అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా
- Mark 3:21 మార్కు 3:21ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.
- John 8:52 యోహాను 8:52అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.
- John 8:47–48 యోహాను 8:47–48దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా
- Matthew 10:25 మత్తయి 10:25శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
- John 7:46–52 యోహాను 7:46–52ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు మీరుకూడ మోస పోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
- Acts 18:14–15 అపొస్తలుల కార్యములు 18:14–15పౌలు నోరు తెరచి మాట లాడబోగా గల్లియోను యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే. ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి
- Matthew 9:34 మత్తయి 9:34అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
- Isaiah 53:8 యెషయా 53:8అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?
- John 9:28–29 యోహాను 9:28–29అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.
- Acts 26:24 అపొస్తలుల కార్యములు 26:24అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు - పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.
- Acts 25:19–20 అపొస్తలుల కార్యములు 25:19–20అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను; ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనోయేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింప బడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.