John · chapter 11 · verse 6
John 11:6 in Telugu
అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.
Atadu rogiyai yunnaadani yesu vininappudu taanunnachotane yinka rendu dinamulu nilichenu.
John 11:6 in English
- King James Version (KJV)
- When he had heard therefore that he was sick, he abode two days still in the same place where he was.
- World English Bible (WEB)
- When therefore he heard that he was sick, he stayed two days in the place where he was.
- American Standard Version (ASV)
- When therefore he heard that he was sick, he abode at that time two days in the place where he was.
- Bible in Basic English (BBE)
- So when the news came to him that Lazarus was ill, he did not go from the place where he was for two days.
- Darby Translation (DBY)
- When therefore he heard, He is sick, he remained two days then in the place where he was.
- Webster's Bible (WBS)
- When therefore he had heard that he was sick, he abode two days still in the same place where he was.
- Young's Literal Translation (YLT)
- when, therefore, he heard that he is ailing, then indeed he remained in the place in which he was two days,
Read in context
- 4యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.
- 5యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
- 6అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.
- 7అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా
- 8ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.
Cross references
- Isaiah 30:18 యెషయా 30:18కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.
- Isaiah 55:8–9 యెషయా 55:8–9నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.
- Genesis 43:29–31 ఆదికాండము 43:29–31అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి - మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి - నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.
- Genesis 22:14 ఆదికాండము 22:14అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
- Genesis 42:24 ఆదికాండము 42:24అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.
- Genesis 45:1–5 ఆదికాండము 45:1–5అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్ను తాను అణచుకొనజాలక నా యొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియ చేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు. అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి. అప్పుడు యోసేపునేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి. అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపున అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.
- Genesis 44:1–5 ఆదికాండము 44:1–5యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి. వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల? దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.
- Matthew 15:22–28 మత్తయి 15:22–28ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.