John · chapter 17 · verse 12
John 17:12 in Telugu
నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.
Nenu vaariyodda undagaa neevu naaku anugrahinchinavaarini nee naamamandu kaapaaditini; nenu vaarini bhadraparachitini ganuka lekhanamu neraverunatlu naashana putrudu tappa vaarilo mari evadunu nashimpaledu.
John 17:12 in English
- King James Version (KJV)
- While I was with them in the world, I kept them in thy name: those that thou gavest me I have kept, and none of them is lost, but the son of perdition; that the scripture might be fulfilled.
- World English Bible (WEB)
- While I was with them in the world, I kept them in your name. I have kept those whom you have given me. None of them is lost except the son of destruction, that the Scripture might be fulfilled.
- American Standard Version (ASV)
- While I was with them, I kept them in thy name which thou hast given me: and I guarded them, and not one of them perished, but the son of perdition; that the scripture might be fulfilled.
- Bible in Basic English (BBE)
- While I was with them I kept them safe in your name which you have given to me: I took care of them and not one of them has come to destruction, but only the son of destruction, so that the Writings might come true.
- Darby Translation (DBY)
- When I was with them I kept them in thy name; those thou hast given me I have guarded, and not one of them has perished, but the son of perdition, that the scripture might be fulfilled.
- Webster's Bible (WBS)
- While I was with them in the world, I kept them in thy name: those that thou gavest to me I have kept, and none of them is lost but the son of perdition; that the scripture might be fulfilled.
- Young's Literal Translation (YLT)
- when I was with them in the world, I was keeping them in Thy name; those whom Thou hast given to me I did guard, and none of them was destroyed, except the son of the destruction, that the Writing may be fulfilled.
Read in context
- 10నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను.
- 11నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
- 12నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.
- 13ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.
- 14వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.
Cross references
- Psalm 109:6–19 కీర్తనలు 109:6–19వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక. వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పు నొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక. వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు కొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.
- John 10:27–28 యోహాను 10:27–28నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.
- John 18:9 యోహాను 18:9నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
- John 13:18 యోహాను 13:18మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.
- Acts 1:16–20 అపొస్తలుల కార్యములు 1:16–20సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను. ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.
- John 6:37 యోహాను 6:37మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.
- John 6:70–71 యోహాను 6:70–71అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
- Acts 1:25 అపొస్తలుల కార్యములు 1:25తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.
- John 6:39–40 యోహాను 6:39–40నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
- 1 John 2:19 1 యోహాను 2:19వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి.
- 2 Thessalonians 2:3 2 థెస్సలొనీకయులకు 2:3మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
- Hebrews 2:13 హెబ్రీయులకు 2:13మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.