John · chapter 18 · verse 12
John 18:12 in Telugu
అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.
Antata sainikulunu sahasraadhipatiyu, yoodula bantrautulunu yesunu pattukoni aayananu bandhinchi, modata annayoddaku aayananu teesikonipoyiri.
John 18:12 in English
- King James Version (KJV)
- Then the band and the captain and officers of the Jews took Jesus, and bound him,
- World English Bible (WEB)
- So the detachment, the commanding officer, and the officers of the Jews seized Jesus and bound him,
- American Standard Version (ASV)
- So the band and the chief captain, and the officers of the Jews, seized Jesus and bound him,
- Bible in Basic English (BBE)
- Then the band and the chief captain and the police took Jesus and put cords round him.
- Darby Translation (DBY)
- The band therefore, and the chiliarch, and the officers of the Jews, took Jesus and bound him:
- Webster's Bible (WBS)
- Then the band, and the captain, and officers of the Jews took Jesus, and bound him,
- Young's Literal Translation (YLT)
- The band, therefore, and the captain, and the officers of the Jews, took hold on Jesus, and bound him,
Read in context
- 10సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.
- 11ఆ దాసుని పేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
- 12అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.
- 13అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.
- 14కయప ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
Cross references
- John 18:3 యోహాను 18:3కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను.
- Matthew 26:57 మత్తయి 26:57యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.
- Acts 21:37 అపొస్తలుల కార్యములు 21:37వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచినేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాషనీకు తెలియునా?
- Acts 21:31 అపొస్తలుల కార్యములు 21:31వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను;
- Matthew 27:2 మత్తయి 27:2ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.
- Acts 22:24–28 అపొస్తలుల కార్యములు 22:24–28వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలునేనైతే పుట్టుకతోనే రోమీయుడ ననెను.
- Mark 14:53 మార్కు 14:53వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసికొని పోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి.
- Luke 22:54 లూకా 22:54వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూర ముగా వారి వెనుక వచ్చుచుండెను.
- Mark 15:1 మార్కు 15:1ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.
- Genesis 22:9 ఆదికాండము 22:9ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.
- Judges 16:21 న్యాయాధిపతులు 16:21అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.
- Acts 23:17–22 అపొస్తలుల కార్యములు 23:17–22అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడు కొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను. శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి ఖైదీయైన పౌలు నన్ను పిలిచినీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసి కొనిపోయి నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను. అందుకతడు నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు; ఇప్పడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.