John · chapter 18 · verse 4
John 18:4 in Telugu
యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి - మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.
Yesu tanaku sambhavimpabovuna vanniyu eriginavaadai vaariyoddaku velli - meerevani vedakuchunnaarani vaarini adigenu.
John 18:4 in English
- King James Version (KJV)
- Jesus therefore, knowing all things that should come upon him, went forth, and said unto them, Whom seek ye?
- World English Bible (WEB)
- Jesus therefore, knowing all the things that were happening to him, went out and said to them, “Who are you looking for?”
- American Standard Version (ASV)
- Jesus therefore, knowing all the things that were coming upon him, went forth, and saith unto them, Whom seek ye?
- Bible in Basic English (BBE)
- Then Jesus, having knowledge of everything which was coming on him, went forward and said to them, Who are you looking for?
- Darby Translation (DBY)
- Jesus therefore, knowing all things that were coming upon him, went forth and said to them, Whom seek ye?
- Webster's Bible (WBS)
- Jesus therefore, knowing all things that were coming upon him, went forth, and said to them, Whom seek ye?
- Young's Literal Translation (YLT)
- Jesus, therefore, knowing all things that are coming upon him, having gone forth, said to them, 'Whom do ye seek?'
Read in context
- 2యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.
- 3కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను.
- 4యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి - మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.
- 5వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.
- 6ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.
Cross references
- John 13:1 యోహాను 13:1తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.
- John 18:7 యోహాను 18:7మరల ఆయన - మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు - నజరేయుడైన యేసునని చెప్పగా
- Acts 20:22–23 అపొస్తలుల కార్యములు 20:22–23ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూష లేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభ వించునో తెలియదుగాని, బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్ట ణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.
- Acts 2:28 అపొస్తలుల కార్యములు 2:28నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు
- Psalm 27:3 కీర్తనలు 27:3నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును.
- Acts 4:24–28 అపొస్తలుల కార్యములు 4:24–28వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
- Matthew 20:18–19 మత్తయి 20:18–19ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.
- Psalm 3:6 కీర్తనలు 3:6పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను
- Matthew 16:21 మత్తయి 16:21అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా
- Matthew 26:2 మత్తయి 26:2రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.
- Proverbs 28:1 సామెతలు 28:1ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
- Matthew 17:22–23 మత్తయి 17:22–23వారు గలిలయలో సంచరించుచుండగా యేసుమనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవు చున్నాడు, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.