John · chapter 3 · verse 17
John 3:17 in Telugu
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
Lokamu tana kumaaruni dvaaraa rakshana pondutakegaani lokamunaku teerpu teerchutaku devudaayananu lokamuloniki pampa ledu.
John 3:17 in English
- King James Version (KJV)
- For God sent not his Son into the world to condemn the world; but that the world through him might be saved.
- World English Bible (WEB)
- For God didn’t send his Son into the world to judge the world, but that the world should be saved through him.
- American Standard Version (ASV)
- For God sent not the Son into the world to judge the world; but that the world should be saved through him.
- Bible in Basic English (BBE)
- God did not send his Son into the world to be judge of the world; he sent him so that the world might have salvation through him.
- Darby Translation (DBY)
- For God has not sent his Son into the world that he may judge the world, but that the world may be saved through him.
- Webster's Bible (WBS)
- For God sent not his Son into the world to condemn the world, but that the world through him may be saved.
- Young's Literal Translation (YLT)
- For God did not send His Son to the world that he may judge the world, but that the world may be saved through him;
Read in context
- 15ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.
- 16దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
- 17లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
- 18ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.
- 19ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
Cross references
- 1 John 4:14 1 యోహాను 4:14మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చు చున్నాము.
- Luke 19:10 లూకా 19:10నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
- John 12:47–48 యోహాను 12:47–48ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.
- John 6:57 యోహాను 6:57జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.
- John 6:40 యోహాను 6:40ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
- John 6:29 యోహాను 6:29యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.
- 1 Timothy 2:5–6 1 తిమోతికి 2:5–6దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.
- John 20:21 యోహాను 20:21అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.
- 1 John 2:2 1 యోహాను 2:2ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.
- John 17:3 యోహాను 17:3అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
- John 11:42 యోహాను 11:42నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.
- John 8:42 యోహాను 8:42యేసు వారితో ఇట్లనెనుదేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.