John · chapter 4 · verse 20
John 4:20 in Telugu
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
Maa pitarulu ee parvatamandu aaraadhinchiri gaani aaraa dhimpavalasina sthalamu yerooshalemulo unnadani meeru cheppudurani aayanato anagaa yesu aameto itlanenu
John 4:20 in English
- King James Version (KJV)
- Our fathers worshipped in this mountain; and ye say, that in Jerusalem is the place where men ought to worship.
- World English Bible (WEB)
- Our fathers worshiped in this mountain, and you Jews say that in Jerusalem is the place where people ought to worship.”
- American Standard Version (ASV)
- Our fathers worshipped in this mountain; and ye say, that in Jerusalem is the place where men ought to worship.
- Bible in Basic English (BBE)
- Our fathers gave worship on this mountain, but you Jews say that the right place for worship is in Jerusalem.
- Darby Translation (DBY)
- Our fathers worshipped in this mountain, and ye say that in Jerusalem is the place where one must worship.
- Webster's Bible (WBS)
- Our fathers worshiped in this mountain; and ye say, that in Jerusalem is the place where men ought to worship.
- Young's Literal Translation (YLT)
- our fathers in this mountain did worship, and ye — ye say that in Jerusalem is the place where it behoveth to worship.'
Read in context
- 18నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.
- 19అప్పుడా స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.
- 20మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
- 21అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;
- 22మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
Cross references
- Deuteronomy 12:5–11 ద్వితీయోపదేశకాండము 12:5–11మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయు చుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణ ములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మునాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి మీ చేతిపనులన్నిటి యందు సంతోషింపవలెను. నేడు మనమిక్కడ చేయు చున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్త మైన దంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువు లందరు లేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థల మునకే మీరు తీసికొని రావలెను.
- Genesis 33:18–20 ఆదికాండము 33:18–20అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.
- Genesis 12:6–7 ఆదికాండము 12:6–7అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలము దాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గర నున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
- 2 Chronicles 7:12 2 దినవృత్తాంతములు 7:12అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిర ముగా కోరుకొంటిని.
- Deuteronomy 11:29 ద్వితీయోపదేశకాండము 11:29కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.
- Deuteronomy 27:12 ద్వితీయోపదేశకాండము 27:12బెన్యామీను గోత్ర ములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.
- 1 Chronicles 21:26 1 దినవృత్తాంతములు 21:26పిమ్మటదావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.
- Psalm 87:1–2 కీర్తనలు 87:1–2ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి
- Psalm 78:68 కీర్తనలు 78:68యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.
- Luke 9:53 లూకా 9:53ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.
- Psalm 132:13 కీర్తనలు 132:13యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.
- 2 Chronicles 6:6 2 దినవృత్తాంతములు 6:6ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.
Original words (Greek)
- Our · G2257ἡμῶν hēmōn
- fathers · G3962πατήρ patḗr
- worshipped · G4352προσκυνέω proskynéō
- in · G1722ἐν en
- this · G5129τούτῳ toútōi
- mountain · G3735ὄρος óros
- and · G2532καί kaí
- ye · G5210ὑμεῖς hymeîs
- say · G3004λέγω légō
- that · G3754ὅτι hóti
- in · G1722ἐν en
- Jerusalem · G2414Ἱεροσόλυμα Hierosólyma
- is · G2076ἐστί estí
- place · G5117τόπος tópos
- where · G3699ὅπου hópou
- ought · G1163δεῖ deî
- worship · G4352προσκυνέω proskynéō