Judges · chapter 5 · verse 10
Judges 5:10 in Telugu
తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి.
Tellagaadidala nekkuvaaralaaraa, tivaasulameeda koorchunduvaaralaaraa, trovalo naduchuvaaralaaraa, ee sangati prakatinchudi.
Judges 5:10 in English
- King James Version (KJV)
- Speak, ye that ride on white asses, ye that sit in judgment, and walk by the way.
- World English Bible (WEB)
- “Speak, you who ride on white donkeys, you who sit on rich carpets, and you who walk by the way.
- American Standard Version (ASV)
- Tell [of it], ye that ride on white asses, Ye that sit on rich carpets, And ye that walk by the way.
- Bible in Basic English (BBE)
- Let them give thought to it, who go on white asses, and those who are walking on the road.
- Darby Translation (DBY)
- Ye that ride on white she-asses, ye that sit on carpets, and ye that walk by the way, consider.
- Webster's Bible (WBS)
- Speak, ye that ride on white asses, ye that sit in judgment, and walk by the way.
- Young's Literal Translation (YLT)
- Riders on white asses — Sitters on a long robe — And walkers by the way — meditate!
Read in context
- 8ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.
- 9జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారియందు నాకు ప్రేమకలదు యెహోవాను స్తుతించుడి.
- 10తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి.
- 11విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.
- 12దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకూ, కీర్తన పాడుము అబీనోయము కుమారుడా, లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము.
Cross references
- Judges 12:14 న్యాయాధిపతులు 12:14అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమ లును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగు వారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.
- Judges 10:4 న్యాయాధిపతులు 10:4అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
- Psalm 105:2 కీర్తనలు 105:2ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
- Joel 3:12 యోవేలు 3:12నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
- Psalm 145:5 కీర్తనలు 145:5మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను
- Psalm 145:11 కీర్తనలు 145:11ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై
- Psalm 107:32 కీర్తనలు 107:32జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
- Isaiah 28:6 యెషయా 28:6ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.