Psalms · chapter 107 · verse 32
Psalm 107:32 in Telugu
జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
Janasamaajamulo vaaraayananu ghanaparachudurugaaka peddala sabhalo aayananu keertinchuduru gaaka
Psalm 107:32 in English
- King James Version (KJV)
- Let them exalt him also in the congregation of the people, and praise him in the assembly of the elders.
- World English Bible (WEB)
- Let them exalt him also in the assembly of the people, and praise him in the seat of the elders.
- American Standard Version (ASV)
- Let them exalt him also in the assembly of the people, And praise him in the seat of the elders.
- Bible in Basic English (BBE)
- Let them give glory to him in the meeting of the people, and praise among the chiefs.
- Darby Translation (DBY)
- Let them exalt him also in the congregation of the people, and praise him in the session of the elders.
- Webster's Bible (WBS)
- Let them exalt him also in the congregation of the people, and praise him in the assembly of the elders.
- Young's Literal Translation (YLT)
- And they exalt Him in the assembly of the people, And in the seat of the elders praise Him.
Read in context
- 30అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.
- 31ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
- 32జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
- 33దేశనివాసుల చెడుతనమునుబట్టి
- 34ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.
Cross references
- Psalm 22:25 కీర్తనలు 22:25మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.
- Psalm 22:22 కీర్తనలు 22:22నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.
- Psalm 99:5 కీర్తనలు 99:5మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.
- Psalm 46:10 కీర్తనలు 46:10ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
- Isaiah 25:1 యెషయా 25:1యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి
- Psalm 119:46 కీర్తనలు 119:46సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.
- Psalm 40:9–10 కీర్తనలు 40:9–10నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.
- Acts 4:8–12 అపొస్తలుల కార్యములు 4:8–12పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
- Exodus 15:2 నిర్గమకాండము 15:2యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.
- Psalm 18:46 కీర్తనలు 18:46యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.
- Psalm 111:1 కీర్తనలు 111:1యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
- Psalm 66:16 కీర్తనలు 66:16దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.