Lamentations · chapter 3 · verse 1
Lamentations 3:1 in Telugu
నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను.
Nenu aayana aagrahadandamucheta baadha nanubhavinchina narudanu.
Lamentations 3:1 in English
- King James Version (KJV)
- I [am] the man [that] hath seen affliction by the rod of his wrath.
- World English Bible (WEB)
- I am the man who has seen affliction by the rod of his wrath.
- American Standard Version (ASV)
- I am the man that hath seen affliction by the rod of his wrath.
- Bible in Basic English (BBE)
- I am the man who has seen trouble by the rod of his wrath.
- Darby Translation (DBY)
- I am the man that hath seen affliction by the rod of his wrath.
- Webster's Bible (WBS)
- I [am] the man [that] hath seen affliction by the rod of his wrath.
- Young's Literal Translation (YLT)
- I [am] the man [who] hath seen affliction By the rod of His wrath.
Read in context
- 1నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను.
- 2ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు.
- 3మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు
Cross references
- Psalm 88:7 కీర్తనలు 88:7నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా. )
- Job 19:21 యోబు 19:21దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.
- Psalm 88:15–16 కీర్తనలు 88:15–16బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి.
- Jeremiah 15:17–18 యిర్మీయా 15:17–18సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్ల సింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా?
- Isaiah 53:3 యెషయా 53:3అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
- Jeremiah 38:6 యిర్మీయా 38:6వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.
- Lamentations 1:12–14 విలాపవాక్యములు 1:12–14త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండకోప దినమున నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించి యున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారియెదుట లేవలేకపోతిని.
- Psalm 71:20 కీర్తనలు 71:20అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.
- Jeremiah 20:14–18 యిర్మీయా 20:14–18నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక; నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక; నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?