Lamentations · chapter 5 · verse 15
Lamentations 5:15 in Telugu
సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
Santoshamu maa hrudayamunu vidichipoyenu naatyamu duhkhamugaa maarchabadiyunnadi.
Lamentations 5:15 in English
- King James Version (KJV)
- The joy of our heart is ceased; our dance is turned into mourning.
- World English Bible (WEB)
- The joy of our heart has ceased. Our dance is turned into mourning.
- American Standard Version (ASV)
- The joy of our heart is ceased; Our dance is turned into mourning.
- Bible in Basic English (BBE)
- The joy of our hearts is ended; our dancing is changed into sorrow.
- Darby Translation (DBY)
- The joy of our heart hath ceased; our dance is turned into mourning.
- Webster's Bible (WBS)
- The joy of our heart hath ceased; our dance is turned into mourning.
- Young's Literal Translation (YLT)
- Ceased hath the joy of our heart, Turned to mourning hath been our dancing.
Read in context
- 13¸యౌవనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.
- 14పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸యౌవనులు సంగీతము మానిరి.
- 15సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
- 16మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.
- 17దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది.
Cross references
- Amos 8:10 ఆమోసు 8:10మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
- Jeremiah 25:10 యిర్మీయా 25:10సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.
- Amos 6:4–7 ఆమోసు 6:4–7దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయు దురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించు కొందురు. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము; వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని
- James 4:9–10 యాకోబు 4:9–10వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
- Psalm 30:11 కీర్తనలు 30:11నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.