Leviticus · chapter 19 · verse 26
Leviticus 19:26 in Telugu
రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడ కూడదు, మంత్ర యోగములు చేయకూడదు,
Raktamu koodinadediyu tinakoodadu, shakunamulu chooda koodadu, mantra yogamulu cheyakoodadu,
Leviticus 19:26 in English
- King James Version (KJV)
- Ye shall not eat [any thing] with the blood: neither shall ye use enchantment, nor observe times.
- World English Bible (WEB)
- “‘You shall not eat any meat with the blood still in it. You shall not use enchantments, nor practice sorcery.
- American Standard Version (ASV)
- Ye shall not eat anything with the blood: neither shall ye use enchantments, nor practise augury.
- Bible in Basic English (BBE)
- Nothing may be used for food with its blood in it; you may not make use of strange arts, or go in search of signs and wonders.
- Darby Translation (DBY)
- Ye shall eat nothing with the blood. — Ye shall not practise enchantment, nor use auguries.
- Webster's Bible (WBS)
- Ye shall not eat [any thing] with the blood: neither shall ye use enchantment, nor observe times.
- Young's Literal Translation (YLT)
- 'Ye do not eat with the blood; ye do not enchant, nor observe clouds.
Read in context
- 24నాలుగవ సంవత్సరమున వాటి ఫలము లన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును;
- 25నేను మీ దేవుడనైన యెహోవాను.
- 26రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడ కూడదు, మంత్ర యోగములు చేయకూడదు,
- 27మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు,
- 28చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
Cross references
- Deuteronomy 18:10–14 ద్వితీయోపదేశకాండము 18:10–14తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.
- 2 Kings 17:17 2 రాజులు 17:17మరియు తమ కుమారులను కుమార్తె లను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టిం చిరి.
- 2 Chronicles 33:6 2 దినవృత్తాంతములు 33:6బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచ ములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయ నకు కోపము పుట్టించెను.
- 2 Kings 21:6 2 రాజులు 21:6అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుక చేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను
- Deuteronomy 12:23 ద్వితీయోపదేశకాండము 12:23అయితే రక్తమును తిననే తిన కూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;
- Leviticus 17:10–14 లేవీయకాండము 17:10–14మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివ సించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము; దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
- Leviticus 7:26 లేవీయకాండము 7:26మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.
- Leviticus 3:17 లేవీయకాండము 3:17అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.
- Jeremiah 10:2 యిర్మీయా 10:2యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.
- Exodus 8:7 నిర్గమకాండము 8:7శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.
- Malachi 3:5 మలాకీ 3:5తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 1 Samuel 15:23 1 సమూయేలు 15:23తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా