Leviticus · chapter 6 · verse 18
Leviticus 6:18 in Telugu
అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయ ములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.
Aharonu santatilo prativaadunu daanini tinavalenu. Idi yehovaa homamula vishaya mulo mee tarataramulaku nityamaina kattada. Vaatiki tagilina prati vastuvu parishuddhamagunu.
Leviticus 6:18 in English
- King James Version (KJV)
- All the males among the children of Aaron shall eat of it. [It shall be] a statute for ever in your generations concerning the offerings of the LORD made by fire: every one that toucheth them shall be holy.
- World English Bible (WEB)
- Every male among the children of Aaron shall eat of it, as their portion forever throughout your generations, from the offerings of the LORD made by fire. Whoever touches them shall be holy.’”
- American Standard Version (ASV)
- Every male among the children of Aaron shall eat of it, as [his] portion for ever throughout your generations, from the offerings of Jehovah made by fire: whosoever toucheth them shall be holy.
- Bible in Basic English (BBE)
- Every male among the children of Aaron may have it for food; it is their right for ever through all your generations, from the offerings made by fire to the Lord: anyone touching them will be holy.
- Darby Translation (DBY)
- All the males among the children of Aaron shall eat of it. [It is] an everlasting statute in your generations, [their portion] of Jehovah's offerings by fire: whatever toucheth these shall be holy.
- Webster's Bible (WBS)
- All the males among the children of Aaron shall eat of it. [It shall be] a statute for ever in your generations concerning the offerings of the LORD made by fire: every one that toucheth them shall be holy.
- Young's Literal Translation (YLT)
- Every male among the sons of Aaron doth eat it — a statute age-during to your generations, out of the fire-offerings of Jehovah: all that cometh against them is holy.'
Read in context
- 16దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరి శుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను;
- 17దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.
- 18అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయ ములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.
- 19మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
- 20అహరోనుకు అభిషేకముచేసిన దినమున, అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయ మున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్య ముగా తూమెడు గోధుమపిండిలో పదియవవంతు.
Cross references
- Numbers 18:10 సంఖ్యాకాండము 18:10ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.
- Leviticus 6:29 లేవీయకాండము 6:29యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.
- Leviticus 6:27 లేవీయకాండము 6:27దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను.
- 1 Peter 1:16 1 పేతురు 1:16మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
- Leviticus 22:3–7 లేవీయకాండము 22:3–7నీవు వారితో ఇట్లనుముమీ తర తరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను. అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమై నను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును, అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రతవలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అప విత్రత తగిలినవాడును సాయంకాలమువరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు. సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.
- Haggai 2:12–14 హగ్గయి 2:12–14ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగు ననిరి. అప్పుడు హగ్గయి వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారు చేయు క్రియ లన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.
- Leviticus 21:21–22 లేవీయకాండము 21:21–22యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు. అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.
- Zechariah 14:20–21 జెకర్యా 14:20–21ఆ దినమున గుఱ్ఱములయొక్క కళ్లె ములమీదయెహోవాకు ప్రతిష్టితము అను మాట వ్రాయ బడును; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలి పీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచ బడును. యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నియు సైన్యములకు అధిపతియగు యెహో వాకు ప్రతిష్టితములగును; బలిపశువులను వధించువారంద రును వాటిలో కావలసినవాటిని తీసికొని వాటిలో వండు కొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు.
- Exodus 29:37 నిర్గమకాండము 29:37ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.
- Leviticus 3:17 లేవీయకాండము 3:17అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.
- 1 Peter 2:9 1 పేతురు 2:9అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.