Luke · chapter 1 · verse 8
Luke 1:8 in Telugu
జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా
Jekaryaa tana taragati kramamuchoppuna devuniyeduta yaajaka dharmamu jariginchuchundagaa
Luke 1:8 in English
- King James Version (KJV)
- And it came to pass, that while he executed the priest’s office before God in the order of his course,
- World English Bible (WEB)
- Now while he executed the priest’s office before God in the order of his division
- American Standard Version (ASV)
- Now it came to pass, while he executed the priest’s office before God in the order of his course,
- Bible in Basic English (BBE)
- Now it came about that in his turn he was acting as priest before God,
- Darby Translation (DBY)
- And it came to pass, as he fulfilled his priestly service before God in the order of his course,
- Webster's Bible (WBS)
- And it came to pass, that, while he executed the priests' office before God in the order of his course,
- Young's Literal Translation (YLT)
- And it came to pass, in his acting as priest, in the order of his course before God,
Read in context
- 6వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.
- 7ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి. )
- 8జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా
- 9యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను.
- 10ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
Cross references
- 1 Chronicles 24:19 1 దినవృత్తాంతములు 24:19ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.
- 2 Chronicles 8:14 2 దినవృత్తాంతములు 8:14అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అను దినమున యాజకుల సముఖమున స్తుతిచేయుటకును, ఉప చారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలి యుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవ జనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.
- 2 Chronicles 31:2 2 దినవృత్తాంతములు 31:2అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారముల యొద్దస్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియ మించెను.
- Luke 1:5 లూకా 1:5యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.
- Exodus 29:1 నిర్గమకాండము 29:1వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు టకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా
- Ezra 6:18 ఎజ్రా 6:18మరియు వారు యెరూష లేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.
- Exodus 29:9 నిర్గమకాండము 29:9అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను.
- 2 Chronicles 11:14 2 దినవృత్తాంతములు 11:14యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.
- Exodus 29:44 నిర్గమకాండము 29:44నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరో నును అతని కుమారులను పరిశుద్ధపరచెదను.
- 2 Chronicles 31:19 2 దినవృత్తాంతములు 31:19సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.
- Exodus 28:1 నిర్గమకాండము 28:1మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
- Exodus 28:41 నిర్గమకాండము 28:41నీవు నీ సహోదరు డైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచ వలెను.