Luke · chapter 12 · verse 21
Luke 12:21 in Telugu
దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
Devuni yedala dhanavantudu kaaka tanakorake samakoorchukonuvaadu aalaagunane yundunani cheppenu.
Luke 12:21 in English
- King James Version (KJV)
- So [is] he that layeth up treasure for himself, and is not rich toward God.
- World English Bible (WEB)
- So is he who lays up treasure for himself, and is not rich toward God.”
- American Standard Version (ASV)
- So is he that layeth up treasure for himself, and is not rich toward God.
- Bible in Basic English (BBE)
- So that is what comes to the man who gets wealth for himself, and has not wealth in the eyes of God.
- Darby Translation (DBY)
- Thus is he who lays up treasure for himself, and is not rich toward God.
- Webster's Bible (WBS)
- So [is] he that layeth up treasure for himself, and is not rich towards God.
- Young's Literal Translation (YLT)
- so [is] he who is treasuring up to himself, and is not rich toward God.'
Read in context
- 19నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.
- 20అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
- 21దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
- 22అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి.
- 23ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
Cross references
- Matthew 6:19–20 మత్తయి 6:19–20భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.
- Luke 12:33 లూకా 12:33మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు
- James 2:5 యాకోబు 2:5నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
- James 5:1–3 యాకోబు 5:1–3ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి. మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.
- Revelation 2:9 ప్రకటన 2:9నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణనే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.
- 1 Timothy 6:18–19 1 తిమోతికి 6:18–19వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.
- Habakkuk 2:9 హబక్కూకు 2:9తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.
- Hosea 10:1 హోషేయ 10:1ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.
- Romans 2:5 రోమీయులకు 2:5నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
- Luke 16:11 లూకా 16:11కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?
- Luke 6:24 లూకా 6:24అయ్యో, ధన వంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు.
- 2 Corinthians 6:10 2 కొరింథీయులకు 6:10దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.