Luke · chapter 12 · verse 47
Luke 12:47 in Telugu
తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
Tana yajamaanuni chitta merigi yundiyu siddhapadaka, atani chittamuchoppuna jarigimpaka undu daasuniki anekamaina debbalu tagulunu.
Luke 12:47 in English
- King James Version (KJV)
- And that servant, which knew his lord’s will, and prepared not [himself], neither did according to his will, shall be beaten with many [stripes].
- World English Bible (WEB)
- That servant who knew his lord’s will, and didn’t prepare nor do what he wanted, will be beaten with many stripes,
- American Standard Version (ASV)
- And that servant, who knew his lord’s will, and made not ready, nor did according to his will, shall be beaten with many [stripes];
- Bible in Basic English (BBE)
- And the servant who had knowledge of his lord's desires and was not ready for him and did not do as he was ordered, will be given a great number of blows;
- Darby Translation (DBY)
- But that bondman who knew his own lord's will, and had not prepared [himself] nor done his will, shall be beaten with many [stripes];
- Webster's Bible (WBS)
- And that servant who knew his lord's will, and prepared not [himself] , neither did according to his will, shall be beaten with many [stripes] .
- Young's Literal Translation (YLT)
- 'And that servant, who having known his lord's will, and not having prepared, nor having gone according to his will, shall be beaten with many stripes,
Read in context
- 45అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగిమత్తుగా ఉండసాగితే
- 46వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును.
- 47తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
- 48అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్య బడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.
- 49నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను.
Cross references
- James 4:17 యాకోబు 4:17కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
- John 9:41 యోహాను 9:41అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.
- John 12:48 యోహాను 12:48నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.
- John 15:22–24 యోహాను 15:22–24నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.
- Deuteronomy 25:2–3 ద్వితీయోపదేశకాండము 25:2–3ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధి పతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను. నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోద రుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.
- Acts 17:30 అపొస్తలుల కార్యములు 17:30ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
- Numbers 15:30–31 సంఖ్యాకాండము 15:30–31అయితే దేశమందు పుట్టినవాడేగాని పర దేశియే గాని యెవడైనను సాహసించి పాపము చేసిన యెడల వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును; వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయ బడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.
- 2 Corinthians 2:15–16 2 కొరింథీయులకు 2:15–16రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
- John 19:11 యోహాను 19:11అందుకు యేసుపైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.
- Luke 10:12–15 లూకా 10:12–15ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణ ములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. అయినను విమర్శకాలము నందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు.
- Matthew 11:22–24 మత్తయి 11:22–24విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.