Luke · chapter 12 · verse 7
Luke 12:7 in Telugu
మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?
Mee talavendruka lanniyu lekkimpabadiyunnavi. Bhayapadakudi; meeru anekamaina pichchukalakante shreshthulu kaaraa?
Luke 12:7 in English
- King James Version (KJV)
- But even the very hairs of your head are all numbered. Fear not therefore: ye are of more value than many sparrows.
- World English Bible (WEB)
- But the very hairs of your head are all counted. Therefore don’t be afraid. You are of more value than many sparrows.
- American Standard Version (ASV)
- But the very hairs of your head are all numbered. Fear not: ye are of more value than many sparrows.
- Bible in Basic English (BBE)
- But even the hairs of your head are numbered. Have no fear: you are of more value than a flock of sparrows.
- Darby Translation (DBY)
- But even the hairs of your head are all numbered. Fear not therefore, ye are better than many sparrows.
- Webster's Bible (WBS)
- But even the very hairs of your head are all numbered. Fear not therefore: ye are of more value than many sparrows.
- Young's Literal Translation (YLT)
- but even the hairs of your head have been all numbered; therefore fear ye not, than many sparrows ye are of more value.
Read in context
- 5ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయ పడుడని మీతో చెప్పుచున్నాను.
- 6అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.
- 7మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?
- 8మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును.
- 9మనుష్యులయెదుట నన్ను ఎరుగననువానిని, నేనును ఎరుగనని దేవుని దూతలయెదుట చెప్పుదును.
Cross references
- Matthew 10:30–31 మత్తయి 10:30–31మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
- Matthew 6:26 మత్తయి 6:26ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
- Isaiah 43:3–4 యెషయా 43:3–4యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను.
- 2 Samuel 14:11 2 సమూయేలు 14:11అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.
- Luke 21:18 లూకా 21:18గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
- 1 Samuel 14:45 1 సమూయేలు 14:45అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
- Acts 27:34 అపొస్తలుల కార్యములు 27:34గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.
- Psalm 8:6 కీర్తనలు 8:6నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
- Matthew 12:12 మత్తయి 12:12గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి