Luke · chapter 20 · verse 24
Luke 20:24 in Telugu
దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు వనిరి.
Deenimeedi roopamunu paivraatayu evanivani adugagaa vaaru kaisaru vaniri.
Luke 20:24 in English
- King James Version (KJV)
- Shew me a penny. Whose image and superscription hath it? They answered and said, Cæsar’s.
- World English Bible (WEB)
- Show me a denarius. Whose image and inscription are on it?” They answered, “Caesar’s.”
- American Standard Version (ASV)
- Show me a denarius. Whose image and superscription hath it? And they said, Cæsar’s.
- Bible in Basic English (BBE)
- Let me see a penny. Whose image and name are on it? And they said, Caesar's.
- Darby Translation (DBY)
- Shew me a denarius. Whose image and superscription has it? And answering they said, Caesar's.
- Webster's Bible (WBS)
- Show me a penny. Whose image and superscription hath it? They answered and said, Cesar's.
- Young's Literal Translation (YLT)
- shew me a denary; of whom hath it an image and superscription?' and they answering said, 'Of Caesar:'
Read in context
- 22మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి.
- 23ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి.
- 24దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు వనిరి.
- 25అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
- 26వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.
Cross references
- Luke 2:1 లూకా 2:1ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.
- Luke 3:1 లూకా 3:1తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబి లేనే దేశమునకు లుసానియ అధిపతిగాను,
- Matthew 18:28 మత్తయి 18:28అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను
- Acts 11:28 అపొస్తలుల కార్యములు 11:28వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.
- Philippians 4:22 ఫిలిప్పీయులకు 4:22నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.
- Luke 23:2 లూకా 23:2ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
- Matthew 20:2 మత్తయి 20:2దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.
- Acts 25:8–12 అపొస్తలుల కార్యములు 25:8–12అందుకు పౌలుయూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించు కొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను. అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను.
- Acts 26:32 అపొస్తలుల కార్యములు 26:32అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.
- Luke 20:22 లూకా 20:22మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి.