Luke · chapter 22 · verse 3
Luke 22:3 in Telugu
అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను
Antata pandrendumandi shishyula sankhyalo cherina iskariyotu anabadina yoodaalo saataanu praveshinchenu
Luke 22:3 in English
- King James Version (KJV)
- Then entered Satan into Judas surnamed Iscariot, being of the number of the twelve.
- World English Bible (WEB)
- Satan entered into Judas, who was also called Iscariot, who was counted with the twelve.
- American Standard Version (ASV)
- And Satan entered into Judas who was called Iscariot, being of the number of the twelve.
- Bible in Basic English (BBE)
- And Satan came into Judas Iscariot, who was one of the twelve.
- Darby Translation (DBY)
- And Satan entered into Judas, who was surnamed Iscariote, being of the number of the twelve.
- Webster's Bible (WBS)
- Then Satan entered into Judas surnamed Iscariot, being of the number of the twelve.
- Young's Literal Translation (YLT)
- And the Adversary entered into Judas, who is surnamed Iscariot, being of the number of the twelve,
Read in context
- 1పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీ పించెను.
- 2ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి.
- 3అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను
- 4గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాటలాడెను.
- 5అందుకు వారు సంతో షించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
Cross references
- John 13:2 యోహాను 13:2వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారు డగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక
- Mark 14:10–11 మార్కు 14:10–11పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకుల చేతికి ఆయనను అప్పగింప వలెనని వారియొద్దకు పోగా వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
- John 13:26–27 యోహాను 13:26–27అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసునీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా
- Psalm 55:12–14 కీర్తనలు 55:12–14నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును. ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము.
- John 13:18 యోహాను 13:18మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.
- Acts 5:3 అపొస్తలుల కార్యములు 5:3అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరి శుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?
- Luke 22:21 లూకా 22:21ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది.
- Psalm 41:9 కీర్తనలు 41:9నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
- Matthew 26:14–16 మత్తయి 26:14–16అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
- John 6:70–71 యోహాను 6:70–71అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
- Luke 6:16 లూకా 6:16యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు.
- John 12:6 యోహాను 12:6వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.