Psalms · chapter 41 · verse 9
Psalm 41:9 in Telugu
నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
Nenu nammukonina naa vihitudu naa yinta bhoja namu chesinavaadu. Nannu tannutakai tana madime nettenu
Psalm 41:9 in English
- King James Version (KJV)
- Yea, mine own familiar friend, in whom I trusted, which did eat of my bread, hath lifted up [his] heel against me.
- World English Bible (WEB)
- Yes, my own familiar friend, in whom I trusted, who ate bread with me, has lifted up his heel against me.
- American Standard Version (ASV)
- Yea, mine own familiar friend, in whom I trusted, Who did eat of my bread, Hath lifted up his heel against me.
- Bible in Basic English (BBE)
- Even my dearest friend, in whom I had faith, who took bread with me, is turned against me.
- Darby Translation (DBY)
- Yea, mine own familiar friend, in whom I confided, who did eat of my bread, hath lifted up [his] heel against me.
- Webster's Bible (WBS)
- Yes, my own familiar friend, in whom I trusted, who ate of my bread, hath lifted up [his] heel against me.
- Young's Literal Translation (YLT)
- Even mine ally, in whom I trusted, One eating my bread, made great the heel against me,
Read in context
- 7నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు.
- 8కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొను చున్నారు.
- 9నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
- 10యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను.
- 11నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
Cross references
- John 13:18 యోహాను 13:18మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.
- Psalm 55:12–14 కీర్తనలు 55:12–14నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును. ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము.
- Matthew 26:23 మత్తయి 26:23ఆయననాతోకూడ పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
- Psalm 55:20–22 కీర్తనలు 55:20–22తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
- John 13:26–27 యోహాను 13:26–27అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసునీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా
- Job 19:19 యోబు 19:19నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.
- Jeremiah 20:10 యిర్మీయా 20:10నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.
- Obadiah 1:7 ఓబద్యా 1:7నీతో సంధిచేసిన వారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.
- 2 Samuel 15:12 2 సమూయేలు 15:12మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతో పెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహు బలమాయెను.
- Micah 7:5 మీకా 7:5స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.
- Job 19:13 యోబు 19:13ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
- Deuteronomy 32:15 ద్వితీయోపదేశకాండము 32:15యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.