Luke · chapter 6 · verse 11
Luke 6:11 in Telugu
అప్పుడు వారు వెఱ్ఱికోపముతో నిండుకొని, యేసును ఏమి చేయు దమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.
Appudu vaaru verrikopamuto nindukoni, yesunu emi cheyu damaa ani yokanitonokadu maatalaadukoniri.
Luke 6:11 in English
- King James Version (KJV)
- And they were filled with madness; and communed one with another what they might do to Jesus.
- World English Bible (WEB)
- But they were filled with rage, and talked with one another about what they might do to Jesus.
- American Standard Version (ASV)
- But they were filled with madness; and communed one with another what they might do to Jesus.
- Bible in Basic English (BBE)
- But they were full of wrath, and were talking together about what they might do to Jesus.
- Darby Translation (DBY)
- But they were filled with madness, and they spoke together among themselves what they should do to Jesus.
- Webster's Bible (WBS)
- And they were filled with madness; and communed one with another what they might do to Jesus.
- Young's Literal Translation (YLT)
- and they were filled with madness, and were speaking with one another what they might do to Jesus.
Read in context
- 9అప్పుడు యేసువిశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి
- 10వారినందరిని చుట్టు కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.
- 11అప్పుడు వారు వెఱ్ఱికోపముతో నిండుకొని, యేసును ఏమి చేయు దమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.
- 12ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
- 13ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను.
Cross references
- Acts 5:33 అపొస్తలుల కార్యములు 5:33వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప నుద్దేశించగా
- Psalm 2:1–2 కీర్తనలు 2:1–2అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
- Ecclesiastes 9:3 ప్రసంగి 9:3అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.
- Acts 4:19 అపొస్తలుల కార్యములు 4:19అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;
- Matthew 21:45 మత్తయి 21:45ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి
- John 11:47 యోహాను 11:47కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.
- John 7:1 యోహాను 7:1అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.
- Acts 26:11 అపొస్తలుల కార్యములు 26:11అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.
- Luke 4:28 లూకా 4:28సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని
- Acts 7:54 అపొస్తలుల కార్యములు 7:54వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.
- Acts 4:15 అపొస్తలుల కార్యములు 4:15అప్పుడు సభ వెలుపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి
- Matthew 12:14–15 మత్తయి 12:14–15అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా