Malachi · chapter 2 · verse 5
Malachi 2:5 in Telugu
నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించు టకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై
Nenu chesina nibandhana vaari jeevamunakunu samaadhaanamunakunu kaaranamaayenu; bhayabhaktulu puttinchu takai nenu vaatini vaarikichchitini ganuka vaaru naayandu bhayabhaktulu kaligi, naa naamamu vishayamulo bhayamu galavaarai
Malachi 2:5 in English
- King James Version (KJV)
- My covenant was with him of life and peace; and I gave them to him [for] the fear wherewith he feared me, and was afraid before my name.
- World English Bible (WEB)
- “My covenant was with him of life and peace; and I gave them to him that he might be reverent toward me; and he was reverent toward me, and stood in awe of my name.
- American Standard Version (ASV)
- My covenant was with him of life and peace; and I gave them to him that he might fear; and he feared me, and stood in awe of my name.
- Bible in Basic English (BBE)
- My agreement with him was on my side life and peace, and I gave them to him; on his side fear, and he had fear of me and gave honour to my name.
- Darby Translation (DBY)
- My covenant with him was of life and peace, and I gave them to him that he might fear; and he feared me, and trembled before my name.
- Webster's Bible (WBS)
- My covenant was with him of life and peace; and I gave them to him [for] the fear with which he feared me, and was afraid before my name.
- Young's Literal Translation (YLT)
- My covenant hath been with him of life and of peace, And I make them to him a fear, and he doth fear Me, And because of My name he hath been affrighted.
Read in context
- 3మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు
- 4అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీ కిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందు రని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- 5నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించు టకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై
- 6సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.
- 7యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను.
Cross references
- Ezekiel 37:26 యెహెజ్కేలు 37:26నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.
- Numbers 25:12–13 సంఖ్యాకాండము 25:12–13కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
- Ezekiel 34:25 యెహెజ్కేలు 34:25మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయుదును.
- Exodus 32:26–29 నిర్గమకాండము 32:26–29అందుకు మోషే పాళెముయొక్క ద్వార మున నిలిచియెహోవా పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచిమీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నా డనెను. లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేలమంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచినేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను.
- Numbers 16:9–10 సంఖ్యాకాండము 16:9–10తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
- Psalm 106:30–31 కీర్తనలు 106:30–31ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచ బడెను.
- Deuteronomy 33:8–11 ద్వితీయోపదేశకాండము 33:8–11లేవినిగూర్చి యిట్లనెను నీ తుమీ్మము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవ కుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము.
- Numbers 18:8–24 సంఖ్యాకాండము 18:8–24మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చి యున్నాను; అభి షేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరి శుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును. వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్ని టిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తిన వచ్చును. ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుష్యులలోనిదేమి జంతువులలోని దేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణ మునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు. అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱెయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠిత మైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును. అల్లాండిపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమా ర్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్ని ధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనువారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్య మేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతి ష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయు లకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రా యేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని.
- Numbers 8:15 సంఖ్యాకాండము 8:15తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్య క్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.
- Numbers 3:45 సంఖ్యాకాండము 3:45నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీ యులు నా వారైయుందురు; నేనే యెహోవాను.