Numbers · chapter 8 · verse 15
Numbers 8:15 in Telugu
తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్య క్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.
Taruvaata neevu vaarini pavitraparachi prati shthaarpanamugaa vaarini arpinchinappudu leveeyulu pratya kshapu gudaaramulo sevacheyutakai lopaliki vellavachchunu.
Numbers 8:15 in English
- King James Version (KJV)
- And after that shall the Levites go in to do the service of the tabernacle of the congregation: and thou shalt cleanse them, and offer them [for] an offering.
- World English Bible (WEB)
- “After that, the Levites shall go in to do the service of the Tent of Meeting. You shall cleanse them, and offer them as a wave offering.
- American Standard Version (ASV)
- And after that shall the Levites go in to do the service of the tent of meeting: and thou shalt cleanse them, and offer them for a wave-offering.
- Bible in Basic English (BBE)
- After that, the Levites will go in to do whatever has to be done in the Tent of meeting; you are to make them clean and give them as a wave offering.
- Darby Translation (DBY)
- And afterwards shall the Levites come in to do the service of the tent of meeting. And thou shalt cleanse them, and offer them as a wave-offering.
- Webster's Bible (WBS)
- And after that shall the Levites go in to perform the service of the tabernacle of the congregation: and thou shalt cleanse them, and offer them [for] an offering.
- Young's Literal Translation (YLT)
- and afterwards do the Levites come in to serve the tent of meeting, and thou hast cleansed them, and hast waved them — a wave-offering.
Read in context
- 13అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.
- 14అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు.
- 15తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్య క్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.
- 16ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయ బడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయు లలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.
- 17ఏలయనగా మనుష్యులలోను పశు వులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించు కొంటిని.
Cross references
- Numbers 8:11 సంఖ్యాకాండము 8:11లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింప వలెను.
- Numbers 8:13 సంఖ్యాకాండము 8:13అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.
- 1 Chronicles 25:1–26 1 దినవృత్తాంతములు 25:1–26మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు. యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు. వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను. వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది. తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి. మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు. మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు. ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పదకొండవది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పదునెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. పందొమ్మిదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.
- Numbers 3:12 సంఖ్యాకాండము 3:12ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.
- Numbers 3:23–37 సంఖ్యాకాండము 3:23–37గెర్షోనీ యుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు. ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకారయౌవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును. కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి. కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబ మునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త. మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందల మంది. మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు. మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.
- 1 Chronicles 23:1–32 1 దినవృత్తాంతములు 23:1–32దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు. వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, ఆరు వేలమంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి. లద్దాను కుమారులు ముగ్గురు; పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు. యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు. యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి. కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు. మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి. మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు. వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి. ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.
- Exodus 29:24 నిర్గమకాండము 29:24అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవే ద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.
- Numbers 4:3–32 సంఖ్యాకాండము 4:3–32ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్య క్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్ర లను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగాదీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను గెర్షోనీయులను వారివారి పితరుల కుటుంబముల చొప్పు నను వారివారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పని చేయ చేరువారందరిని లెక్కింప వలెను. పనిచేయు టయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ; వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడార మును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టును బలిపీఠము చుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధ మైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయ బడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోనుయొక్కయు అతని కుమారులయొక్కయు నోటిమాట చొప్పున జరుగ వలెను. వారు జరుపువాటి నన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడా రములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను. మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడార ములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభము లను దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభము లను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావ లసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.