Mark · chapter 12 · verse 31
Mark 12:31 in Telugu
రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను
Rendavadi, neevu ninnuvale nee poruguvaanini premimpavale nanunadi rendava aajnya; veetikante mukhyamaina aajnya mare diyu ledani atanito cheppenu
Mark 12:31 in English
- King James Version (KJV)
- And the second [is] like, [namely] this, Thou shalt love thy neighbour as thyself. There is none other commandment greater than these.
- World English Bible (WEB)
- The second is like this: ‘You shall love your neighbor as yourself.’ There is no other commandment greater than these.”
- American Standard Version (ASV)
- The second is this, Thou shalt love thy neighbor as thyself. There is none other commandment greater than these.
- Bible in Basic English (BBE)
- The second is this, Have love for your neighbour as for yourself. There is no other law greater than these.
- Darby Translation (DBY)
- And a second like it [is] this: Thou shalt love thy neighbour as thyself. There is not another commandment greater than these.
- Webster's Bible (WBS)
- And the second [is] like, [namely] this, Thou shalt love thy neighbor as thyself: there is no other commandment greater than these.
- Young's Literal Translation (YLT)
- and the second [is] like [it], this, Thou shalt love thy neighbour as thyself; — greater than these there is no other command.'
Read in context
- 29అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
- 30నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.
- 31రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను
- 32ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.
- 33పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.
Cross references
- Romans 13:8–9 రోమీయులకు 13:8–9ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
- Matthew 22:39 మత్తయి 22:39నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
- Leviticus 19:18 లేవీయకాండము 19:18కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
- Luke 10:27 లూకా 10:27అతడు - నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకము తోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నాదని చెప్పెను.
- 1 Corinthians 13:4–8 1 కొరింథీయులకు 13:4–8ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;
- Matthew 7:12 మత్తయి 7:12కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది.
- Galatians 5:14 గలతీయులకు 5:14ధర్మశాస్త్ర మంతయునిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.
- 1 John 4:21 1 యోహాను 4:21దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.
- 1 John 4:7–8 1 యోహాను 4:7–8ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
- Matthew 19:18–19 మత్తయి 19:18–19యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను.
- James 2:8–13 యాకోబు 2:8–13మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును; వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.
- Luke 10:36–37 లూకా 10:36–37కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు - అతనిమీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.