Matthew · chapter 24 · verse 27
Matthew 24:27 in Telugu
మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.
Merupu toorpuna putti padamativaraku elaagu kanabaduno aalaage manushyakumaaruni raakadayu nundunu.
Matthew 24:27 in English
- King James Version (KJV)
- For as the lightning cometh out of the east, and shineth even unto the west; so shall also the coming of the Son of man be.
- World English Bible (WEB)
- For as the lightning flashes from the east, and is seen even to the west, so will the coming of the Son of Man be.
- American Standard Version (ASV)
- For as the lightning cometh forth from the east, and is seen even unto the west; so shall be the coming of the Son of man.
- Bible in Basic English (BBE)
- Because as in a thunderstorm the bright light coming from the east is seen even in the west; so will be the coming of the Son of man.
- Darby Translation (DBY)
- For as the lightning goes forth from the east and shines to the west, so shall be the coming of the Son of man.
- Webster's Bible (WBS)
- For as the lightning cometh out of the east, and shineth even to the west; so shall also the coming of the Son of man be.
- Young's Literal Translation (YLT)
- for as the lightning doth come forth from the east, and doth appear unto the west, so shall be also the presence of the Son of Man;
Read in context
- 25ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.
- 26కాబట్టి ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి
- 27మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.
- 28పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును.
- 29ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును.
Cross references
- Luke 17:24–37 లూకా 17:24–37ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దెమీద ఉండు వాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్ట బడుననెను. శిష్యులు ప్రభువా, యిది ఎక్కడ (జరుగు) నని ఆయన నడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.
- Zechariah 9:14 జెకర్యా 9:14యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలె విడువ బడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణదిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలు దేరును.
- Malachi 3:2 మలాకీ 3:2అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు;
- James 5:8 యాకోబు 5:8ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి.
- Isaiah 30:30 యెషయా 30:30యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.
- Job 37:3 యోబు 37:3ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును.
- 2 Peter 3:4 2 పేతురు 3:4ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను
- Malachi 4:5 మలాకీ 4:5యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
- Matthew 24:37 మత్తయి 24:37నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును.
- Job 38:35 యోబు 38:35మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
- Matthew 24:39 మత్తయి 24:39జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.
- Matthew 16:28 మత్తయి 16:28ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.