Matthew · chapter 27 · verse 43
Matthew 27:43 in Telugu
వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
Vaadu devuniyandu vishvaasamunchenu, nenu devuni kumaarudanani cheppenu ganuka aayanakishtudaite aayana ippudu vaanini tappinchunani cheppiri.
Matthew 27:43 in English
- King James Version (KJV)
- He trusted in God; let him deliver him now, if he will have him: for he said, I am the Son of God.
- World English Bible (WEB)
- He trusts in God. Let God deliver him now, if he wants him; for he said, ‘I am the Son of God.’”
- American Standard Version (ASV)
- He trusteth on God; let him deliver him now, if he desireth him: for he said, I am the Son of God.
- Bible in Basic English (BBE)
- He put his faith in God; let God be his saviour now, if he will have him; for he said, I am the Son of God.
- Darby Translation (DBY)
- He trusted upon God; let him save him now if he will [have] him. For he said, I am Son of God.
- Webster's Bible (WBS)
- He trusted in God; let him deliver him now if he will have him: for he said, I am the Son of God.
- Young's Literal Translation (YLT)
- he hath trusted on God, let Him now deliver him, if He wish him, because he said — Son of God I am;'
Read in context
- 41ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు
- 42వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.
- 43వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
- 44ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.
- 45మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
Cross references
- Psalm 22:8 కీర్తనలు 22:8యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.
- John 10:36 యోహాను 10:36తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
- Psalm 71:11 కీర్తనలు 71:11దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు.
- Isaiah 37:10 యెషయా 37:10యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.
- Matthew 27:40 మత్తయి 27:40దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి
- John 19:7 యోహాను 19:7అందుకు యూదులు మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.
- Psalm 14:6 కీర్తనలు 14:6బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.
- John 5:17–25 యోహాను 5:17–25అయితే యేసునాతండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Psalm 3:2 కీర్తనలు 3:2దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదనినన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా. )
- John 3:16–17 యోహాను 3:16–17దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
- Isaiah 36:18 యెషయా 36:18ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను?
- Psalm 42:10 కీర్తనలు 42:10నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.