Matthew · chapter 7 · verse 22
Matthew 7:22 in Telugu
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
Aa dinamandu anekulu nannu choochiprabhuvaa, prabhuvaa, memu nee naamamuna pravachimpaledaa? Nee naamamuna dayyamulanu vellagottaledaa? Nee naamamuna anekamaina adbhutamulu cheyaledaa? Ani cheppuduru.
Matthew 7:22 in English
- King James Version (KJV)
- Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in thy name? and in thy name have cast out devils? and in thy name done many wonderful works?
- World English Bible (WEB)
- Many will tell me in that day, ‘Lord, Lord, didn’t we prophesy in your name, in your name cast out demons, and in your name do many mighty works?’
- American Standard Version (ASV)
- Many will say to me in that day, Lord, Lord, did we not prophesy by thy name, and by thy name cast out demons, and by thy name do many mighty works?
- Bible in Basic English (BBE)
- A great number will say to me on that day, Lord, Lord, were we not prophets in your name, and did we not by your name send out evil spirits, and by your name do works of power?
- Darby Translation (DBY)
- Many shall say to me in that day, Lord, Lord, have we not prophesied through thy name, and through thy name cast out demons, and through thy name done many works of power?
- Webster's Bible (WBS)
- Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in thy name? and in thy name have cast out demons? and in thy name done many wonderful works?
- Young's Literal Translation (YLT)
- Many will say to me in that day, Lord, lord, have we not in thy name prophesied? and in thy name cast out demons? and in thy name done many mighty things?
Read in context
- 20కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
- 21ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
- 22ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
- 23అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
- 24కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
Cross references
- Luke 13:25–27 లూకా 13:25–27ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు ఆయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖ మందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడాయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమము చేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును.
- 1 Corinthians 13:1–2 1 కొరింథీయులకు 13:1–2మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
- Malachi 3:17–18 మలాకీ 3:17–18నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించు నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగలవా రెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.
- Hebrews 6:4–6 హెబ్రీయులకు 6:4–6ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
- Acts 19:13–15 అపొస్తలుల కార్యములు 19:13–15అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులుపౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా
- 2 Timothy 4:8 2 తిమోతికి 4:8ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.
- 2 Timothy 1:12 2 తిమోతికి 1:12ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
- Matthew 25:11 మత్తయి 25:11అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
- John 11:51 యోహాను 11:51తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక
- Numbers 24:4 సంఖ్యాకాండము 24:4అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.
- Matthew 24:36 మత్తయి 24:36అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.
- Luke 10:12 లూకా 10:12ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.