Matthew · chapter 9 · verse 21
Matthew 9:21 in Telugu
నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.
Nenu aayana pai vastramu maatramu muttite baagupadudunani tanalo taanu anukoni, aayana venukaku vachchi aayana vastrapu chengu muttenu.
Matthew 9:21 in English
- King James Version (KJV)
- For she said within herself, If I may but touch his garment, I shall be whole.
- World English Bible (WEB)
- for she said within herself, “If I just touch his garment, I will be made well.”
- American Standard Version (ASV)
- for she said within herself, If I do but touch his garment, I shall be made whole.
- Bible in Basic English (BBE)
- Because, she said to herself, if I may but put my hand on his robe, I will be made well.
- Darby Translation (DBY)
- for she said within herself, If I should only touch his garment I shall be healed.
- Webster's Bible (WBS)
- For she said within herself, If I may but touch his garment, I shall be whole.
- Young's Literal Translation (YLT)
- for she said within herself, 'If only I may touch his garment, I shall be saved.'
Read in context
- 19యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి.
- 20ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ
- 21నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.
- 22యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను.
- 23అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి
Cross references
- Mark 5:26–33 మార్కు 5:26–33తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను. ఆమె యేసునుగూర్చి వినినేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగినా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.
- Luke 8:45–47 లూకా 8:45–47నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును - మేమెరుగమన్నప్పుడు, పేతురు - ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా యేసు - ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసినదనెను. తాను మరుగై యుండలేదని, ఆ స్త్రీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను.
- Acts 19:12 అపొస్తలుల కార్యములు 19:12అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.