Micah · chapter 3 · verse 2
Micah 3:2 in Telugu
అయినను మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు.
Ayinanu melu nasahyinchukoni keeducheya nishtapaduduru, naa janula charmamu oodadeesi vaari yemukalameedi maansamu cheelchuchunduru.
Micah 3:2 in English
- King James Version (KJV)
- Who hate the good, and love the evil; who pluck off their skin from off them, and their flesh from off their bones;
- World English Bible (WEB)
- You who hate the good, and love the evil; who tear off their skin, and their flesh from off their bones;
- American Standard Version (ASV)
- ye who hate the good, and love the evil; who pluck off their skin from off them, and their flesh from off their bones;
- Bible in Basic English (BBE)
- You who are haters of good and lovers of evil, pulling off their skin from them and their flesh from their bones;
- Darby Translation (DBY)
- Ye who hate the good, and love evil; who pluck off their skin from them, and their flesh from off their bones;
- Webster's Bible (WBS)
- Who hate the good, and love the evil; who pluck off their skin from them, and their flesh from off their bones;
- Young's Literal Translation (YLT)
- Ye who are hating good, and loving evil, Taking violently their skin from off them, And their flesh from off their bones,
Read in context
- 1నేనీలాగు ప్రకటించితిని యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా.
- 2అయినను మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు.
- 3నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయు నట్టు బానలో వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.
- 4వారు దుర్మార్గత ననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును.
Cross references
- Ezekiel 22:27 యెహెజ్కేలు 22:27దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.
- Psalm 53:4 కీర్తనలు 53:4దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?
- Proverbs 28:4 సామెతలు 28:4ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.
- 2 Chronicles 19:2 2 దినవృత్తాంతములు 19:2దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటనచేసెనునీవు భక్తిహీనులకు సహాయముచేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.
- 1 Kings 22:6–8 1 రాజులు 22:6–8ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించియుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకుయెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతువిచారణ చేయుటకై వీరు తప్పయెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇశ్రాయేలురాజుఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలా గనవద్దనెను.
- 1 Kings 21:20 1 రాజులు 21:20అంతట అహాబు ఏలీయాను చూచినా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెనుయెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.
- Romans 12:9 రోమీయులకు 12:9మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
- Romans 1:32 రోమీయులకు 1:32ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
- 2 Timothy 3:3 2 తిమోతికి 3:3అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
- Acts 7:51–52 అపొస్తలుల కార్యములు 7:51–52ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
- Amos 5:10–14 ఆమోసు 5:10–14అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు. దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును.
- John 15:18–19 యోహాను 15:18–19లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.