Nahum · chapter 3 · verse 11
Nahum 3:11 in Telugu
నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.
Neevunu matturaalavai daagukonduvu, shatruvu vachchuta choochi aashrayadurgamu vedakuduvu.
Nahum 3:11 in English
- King James Version (KJV)
- Thou also shalt be drunken: thou shalt be hid, thou also shalt seek strength because of the enemy.
- World English Bible (WEB)
- You also will be drunken. You will be hidden. You also will seek a stronghold because of the enemy.
- American Standard Version (ASV)
- Thou also shalt be drunken; thou shalt be hid; thou also shalt seek a stronghold because of the enemy.
- Bible in Basic English (BBE)
- And you will be overcome with wine, you will become feeble; you will be looking for a safe place from those who are fighting against you.
- Darby Translation (DBY)
- Thou also shalt be drunken: thou shalt be hid; thou also shalt seek a refuge from the enemy.
- Webster's Bible (WBS)
- Thou also shalt be drunken: thou shalt be hid, thou also shalt seek strength because of the enemy.
- Young's Literal Translation (YLT)
- Even thou art drunken, thou art hidden, Even thou dost seek a strong place, because of an enemy.
Read in context
- 9కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి.
- 10అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.
- 11నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.
- 12అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;
- 13నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల యడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.
Cross references
- Luke 23:30 లూకా 23:30అప్పుడు మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.
- Isaiah 2:10 యెషయా 2:10యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.
- Isaiah 49:26 యెషయా 49:26యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.
- Hosea 10:8 హోషేయ 10:8ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరు గును, పర్వతములను చూచిమమ్మును మరుగుచేయు డనియు, కొండలను చూచిమామీద పడుడనియు వారు చెప్పుదురు.
- Isaiah 2:19 యెషయా 2:19యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.
- Psalm 75:8 కీర్తనలు 75:8యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.
- Jeremiah 4:5 యిర్మీయా 4:5యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగాప్రాకారముగల పట్టణ ములలోనికి పోవునట్లుగా పోగై రండి.
- Nahum 1:10 నహూము 1:10ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.
- Revelation 6:15–17 ప్రకటన 6:15–17భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
- Isaiah 63:6 యెషయా 63:6కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.
- Nahum 2:1 నహూము 2:1లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలికాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము,
- Jeremiah 51:57 యిర్మీయా 51:57దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదను వారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.